పార్వతీ పరమేశ్వరుల ప్రధమ పుత్రుడైన శ్రీ వినాయకుడు అవతరించిన పవిత్ర దినం నేడు.
భక్తులందరూ ఆయన్ని విశ్వాసంతో పూజించుకుంటారు.

శ్రీ పార్వతీదేవి ప్రతిష్టించినప్పటి నుండి వినాయకుడు భక్తులలో విశ్వాసం కలిగించే విఘ్ననాయకుడు అయ్యాడు.
పెద్ద బొజ్జ, అనేక అవరోధాలు ఉన్నప్పటికీ వాటిని బుద్ధి, యుక్తి, ధైర్యంతో ఎదుర్కొని, ఆది దేవుడిగా ప్రసిద్ధికెక్కాడు.

Advertisement

ఏ శుభకార్యం అయినా మొదట ఆయన పూజతోనే ఆరంభం కావడం ఆయన్ను విశ్వవ్యాప్తుడిని చేసింది.
భారతదేశం మాత్రమే కాకుండా ఖండాంతరాలలో కూడా వినాయకచవితిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

ఈ పండుగ మనకు కేవలం పూజాకార్యక్రమాలకే పరిమితం కాకుండా, జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రేరణ ఇస్తుంది.

Advertisement

మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, శాంతి, శ్రేయస్సులతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

వినాయకచవితి శుభాకాంక్షలు!


B. Mallikarjuna Deekshit
Marketing Officer – New India Assurance
Regional Chairman – Media Relations (All Twin Cities Clubs)
Asst. Governor 2023-24 – Rotary International Dist. 3150
Family Counselor & Counseling Psychologist
Joint Secretary – Progressive Psychologists Association of India
📱 91333 20425