దేవీ నవరాత్రులలో ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? కథలు, ఆచారాలు
దేవీ నవరాత్రుల సమయంలో ఆయుధ పూజ ఎందుకు చేస్తారో వివరించే తెలుగు వ్యాసం: పాండవుల ఆయుధాలు, జమ్మి చెట్టు కథ, దుర్గముడిపై దుర్గాదేవి విజయం, రైతులు, టైలర్లు, చేనేత కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు తమ పనిముట్లను పూజించే తీరు, నేటి ఫోన్లు, కంప్యూటర్లు, కేరళ, తమిళనాడు ఆచారాలు.

దేవీ నవరాత్రుల సమయంలో ఆయుధ పూజ ఎందుకు చేస్తారో వివరించే తెలుగు వ్యాసం: పాండవుల ఆయుధాలు, జమ్మి చెట్టు కథ, దుర్గముడిపై దుర్గాదేవి విజయం, రైతులు, టైలర్లు, చేనేత కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు తమ పనిముట్లను పూజించే తీరు, నేటి ఫోన్లు, కంప్యూటర్లు, కేరళ, తమిళనాడు ఆచారాలు.
ఆయుధ పూజ 2026: దృక్ పంచాంగం ప్రకారం భారతదేశంలో ఆయుధ పూజ మంగళవారం, 20 అక్టోబర్ 2026, విజయదశమితో పాటు. తమిళనాడు, కేరళ, చాలా దక్షిణాది ఇళ్లలో సరస్వతీ పూజతో కలిపి మహర్నవమి సోమవారం, 19 అక్టోబర్న చేస్తారు. USA, కెనడా, UKలలో మహా నవమి సోమవారం, 19 అక్టోబర్, కనుక విదేశాల్లో చాలా కుటుంబాలు ఆ సాయంత్రం గానీ, మర్నాడు విజయదశమితో గానీ ఆయుధ పూజ చేస్తాయి; మీ కుటుంబ ఆచారాన్ని లేదా స్థానిక ఆలయాన్ని అనుసరించండి. దశలవారీ పూజా విధానం కోసం పనిముట్లు, వాహనాలు, పుస్తకాలు, ల్యాప్‌టాప్‌లకు ఆయుధ పూజా విధానం చూడండి.
దేవీ నవరాత్రుల సమయంలో ఆయుధ పూజ చేయడానికి కారణం?
భారత దేశంలో ఘనంగా జరుపుకునే పండుగల్లో విజయ దశమి ఒకటి. నవరాత్రులు, దుర్గాష్టమితో దసరా ఉత్సవంగా జరుపుకునే ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారాన్ని హిందువులలో చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు.
పవిత్రమైన ఈ పర్వదినాన హిందువులలో చాలా మంది తమ పనికి సంబంధించిన వస్తువులన్నింటినీ, ఇతర సామాగ్రిని దుర్గా మాత ముందు ఉంచి పూజలు చేస్తారు.
ఎవరు ఏ పనిముట్లను పూజిస్తారు
రైతులు అయితే కొడవలి, నాగలి, వాహనం ఉన్న వారు తమ వాహనాలకు, టైలర్లు తమ కుట్టు మిషన్లకు, చేనేత కార్మికులు మగ్గాలకు, ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు, ఇతర పనిముట్లకు పసుపు, కుంకుమతో అద్ది వాటిని దేవతలతో సమానంగా ఆరాధిస్తారు.
ప్రతి సంవత్సరం ఆయుధ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు? ఎందుకని దీనికంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం…
పాండవులు, జమ్మి చెట్టు
పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత విజయదశమి నాడు తిరిగి తీసుకుని పూజించారని ప్రచారంలో ఉన్న కథనం. (మహాభారతం విరాట పర్వంలో అజ్ఞాతవాసం ముగిసే సమయానికి అర్జునుడు జమ్మి చెట్టు నుంచి ఆయుధాలను తిరిగి తీసుకుంటాడు.) అర్జునుడు గాండీవంతో పాటు భీమసేనుని గదాయుధానికి యుద్ధానికి వెళ్లడానికి ముందు ప్రత్యేకంగా పూజలు జరిపించారు.
అలా వారు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని, పాండవులు యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెబుతుంటారు. మరోవైపు దుర్గతులను నివారించే మహా స్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు.
భవబంధాల నుంచి విముక్తి నిచ్చే దుర్గాదేవి
పంచప్రకృతి మహా స్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాల్లో చిక్కుకున్న వ్యక్తులను అమ్మవారు అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని ఈరోజు స్మరించుకుంటే.. శత్రు బాధలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం.
ఆయుధ పూజ రోజున మంత్రం, పూజా క్రమం
ఆయుధ పూజ రోజున ‘ఓం దుం దుర్గాయై నమః’ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలొస్తాయని విశ్వాసం. అలాగే లలిత అష్టోత్తరాలు పఠించాలి. ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్రపూజలు చేయాలి.
పూజకు ముందు చెప్పుకునే సంకల్పం కోసం ఆయుధ పూజ సంకల్పం, అర్థం చూడండి.
ఆట వస్తువుల నుంచి ఫోన్లు, కంప్యూటర్ల దాకా
ప్రస్తుతం ఆయుధ పూజలంటే ఆట వస్తువుల నుండి వంట వస్తువుల దాకా పాకింది. కరోనా వంటి మహమ్మారి కాలంలో చాలా మంది తమ బ్యాట్లు, క్రికెట్ కిట్లు, గ్యాస్ స్టవ్, ఫోన్లు, కంప్యూటర్ల వంటి వాటిని పూజిస్తున్నారు.
వాహనాలు ఉన్నవారు ఆయుధ పూజ, వాహన పూజ మంత్రాలు, విధానం అనుసరించవచ్చు.
ప్రాంతీయ ఆచారాలు
ఆయుధ పూజనే కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అంటారు. కేరళలో నవమి నాడు ఆయుధ పూజ, సరస్వతీ పూజ చేస్తారు: పుస్తకాలు, పనిముట్లను పూజలో ఉంచుతారు (పూజ వెప్పు), విజయదశమి నాడు వాటిని తిరిగి తీసుకుని పిల్లలకు విద్యారంభం చేస్తారు. తమిళనాడులో నవమి నాడు ఆయుధ పూజ, సరస్వతీ పూజ కలిపి చేస్తారు. నవరాత్రుల్లో బొమ్మల కొలువు పెట్టే ‘గోలు’ (బొమ్మై కొలు) కూడా అక్కడ ఎంతో ఇష్టమైన ఆచారం.
విద్యారంభం గురించి మరింత: విజయదశమి నాడు సరస్వతీ పూజ, విద్యారంభం; శమీ పూజ గురించి విజయదశమి 2026 మంత్రాలు, అపరాజిత, శమీ పూజా విధానం చూడండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
దేవీ నవరాత్రులలో ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?
తమ పనికి సంబంధించిన పనిముట్లను పవిత్రంగా భావించి దేవీ నవరాత్రుల సమయంలో దుర్గా మాత ముందు ఉంచి పూజించడమే ఆయుధ పూజ. అజ్ఞాతవాసం ముగిసిన తరువాత జమ్మి చెట్టు నుంచి ఆయుధాలను తిరిగి తీసుకున్న పాండవుల కథతో, దుర్గముడు అనే రాక్షసుడిపై దుర్గాదేవి విజయంతో ఈ ఆచారాన్ని ముడిపెట్టే కథలు ప్రచారంలో ఉన్నాయి.
2026లో ఆయుధ పూజ ఎప్పుడు?
దృక్ పంచాంగం ఆయుధ పూజను విజయదశమితో పాటు మంగళవారం, 20 అక్టోబర్ 2026న చూపుతుంది. తమిళనాడు, కేరళ, చాలా దక్షిణాది ఇళ్లలో సరస్వతీ పూజతో కలిపి మహర్నవమి సోమవారం, 19 అక్టోబర్న చేస్తారు. USA, కెనడా, UKలలో మహా నవమి సోమవారం, 19 అక్టోబర్; మీ కుటుంబ ఆచారాన్ని లేదా స్థానిక ఆలయాన్ని అనుసరించండి.
ఆయుధ పూజ రోజున వేటిని పూజిస్తారు?
ఎవరి పనిముట్లను వారు పూజిస్తారు: రైతులు కొడవలి, నాగలి, వాహనం ఉన్న వారు వాహనాలు, టైలర్లు కుట్టు మిషన్లు, చేనేత కార్మికులు మగ్గాలు, ఫ్యాక్టరీ కార్మికులు మిషన్లు. ఈ రోజుల్లో చాలా మంది బ్యాట్లు, క్రికెట్ కిట్లు, గ్యాస్ స్టవ్, ఫోన్లు, కంప్యూటర్లకు కూడా పసుపు, కుంకుమ అద్ది పూజిస్తున్నారు.
పాండవులు, జమ్మి చెట్టు కథ ఏమిటి?
మహాభారతం విరాట పర్వం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచారు. అజ్ఞాతవాసం ముగిసిన తరువాత విజయదశమి నాడు అర్జునుడు వాటిని తిరిగి తీసుకున్నాడని, గాండీవం, భీముని గదాయుధంతో సహా ఆ ఆయుధాలకు కురుక్షేత్ర యుద్ధానికి ముందు పూజలు జరిపారని ప్రచారంలో ఉన్న కథనం.
ఆయుధ పూజ రోజున ఏ మంత్రం జపిస్తారు?
‘ఓం దుం దుర్గాయై నమః’ అనే మంత్రాన్ని పఠించి, లలిత అష్టోత్తరం చదివి, ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్ర పూజ చేయాలని రచయిత సూచిస్తున్నారు. పూర్తి సంకల్పం, దశలవారీ పూజా విధానం కోసం ఈ పేజీలో ఇచ్చిన ఆయుధ పూజ వ్యాసాలు చూడండి.
సంపాదకుని గమనిక (19 అక్టోబర్ 2026)
ఈ వ్యాసం తెలుగులో HinduToneకు అందింది. తెలుగు పాఠమే మూలం; ఆంగ్ల పేజీ దాని యథాతథ అనువాదం. చిన్న సవరణలు చేశాం: పాండవులు, జమ్మి చెట్టు కథను మహాభారతం విరాట పర్వం, ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం ఇచ్చాం, కేరళ, తమిళనాడు ఆచారాలను సాధారణంగా పాటించే విధంగా పేర్కొన్నాం, ఫలితాల గురించిన వాక్యాలను విశ్వాసంగా పేర్కొన్నాం, అక్షరదోషాలు సవరించాం, 2026 తేదీలు జోడించాం. తేదీలు దృక్ పంచాంగం ఆధారంగా.
చివరిగా నవీకరించినది: 19 అక్టోబర్ 2026.
సంబంధిత వ్యాసాలు
- ఆయుధ పూజ 2026: తేదీ, శస్త్ర పూజా విధానం
- ఆయుధ పూజ 2026: పనిముట్లు, వాహనాలు, పుస్తకాలు, ల్యాప్‌టాప్‌ల పూజా విధానం
- ఆయుధ పూజ సంకల్పం 2026, అర్థం
- ఆయుధ పూజ, వాహన పూజ: మంత్రాలు, విధానం
- ఆయుధ పూజ, వాహన పూజ, శమీ పూజ: విజయదశమి విధానం
- USAలో కొత్త కారుకు వాహన పూజ
- విజయదశమి 2026 మంత్రాలు, అపరాజిత, శమీ పూజా విధానం
- విజయదశమి నాడు సరస్వతీ పూజ, విద్యారంభం
- నవరాత్రి 2026: తేదీలు, నవదుర్గల పేర్లు, పూజా విధానం
- దసరా మహర్నవమి విశిష్టత: అమ్మవారి నవరాత్రి అలంకారాలు



