శ్రీరాముడు జయరాముడు

శ్రీరాముడిని పూజించడం అంటే మనలోని మానవత్వాన్ని మంచితనాన్ని బయటకు వ్యక్తపరచడమన్నమాట
ఒక రాయినే స్త్రీగా మార్చిన రఘురాముడు మనకు స్త్రీలను ఎలా అభిమానంగా ఆధరంగా గౌరవంగా చూడాలో తెలియజేసాడు
తల్లిమాటను పాటించడం తన కర్త్యవ్యంగా భావించి అందులో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని చిరునవ్వుతో స్వీకరించి అధర్మాన్ని అణచివేసి ధర్మపథంలో పయనించి విజేయుడుగా అజేయుడుగా నిలిచి లోకానికే ఆదర్శప్రాయుడైన ధర్మానందనుడు శ్రీరామచంద్రమూర్తి
రాజు ప్రజలను ఒక పాలకుడిగా మిత్రుడుగా వాళ్ళ కష్టసుఖాల్లో ఒకరిగా పాలుపంచుకుంటూ కుటుంబంలో యజమాని తన కుటుంబానికి ఏలోటూ లేకుండా రాకుండా చూసుకోవాలో తెలియజెప్పిన దశరధ తనయ రాముడు
ఏ చెడు అలవాట్లకు బానిస కాకుండా జీవితాన్ని ఆదర్శప్రాయంగా గడపాలని మనకు నిర్దేశించిన ఆదర్శమూర్తి రామచంద్రుడు
సోదరుల మధ్య ప్రేమ వాత్సల్యం కలిగిఉండాలని వివాదాలకు తావుండకూడదని చాటిచెప్పి భాంధావ్యాలకు పెద్దపీట వేసి మానవ సంబంధాలకు అర్ధం పరమార్ధం చెప్పిన మన రామయ్య
కష్టాలంటే వణికిపోయి వివాహం అంటే విముఖ్టత చూపే నేటి యువతరానికి వివాహం చేసుకుని నిత్యం కొట్లాడుకుంటూ సంసారాన్ని నరకప్రాయం చేసుకునే ఆలుమగలు వివాహమనేది దేవుడు సృష్టించిన ఒక పవిత్రబంధమని దానికి జీవితాతం కట్టుబడి వుంటూ తమ జీవితాలను ఆ బంధంతో పెనవేసుకుంటూ జగతికి ఆదర్శప్రాయం కావాలని చాటిచెప్పిన మానవజాతి నిత్యం కొలిచే మహనీయుడు భగవంతుడు శ్రీరామచంద్రప్రభు
జై శ్రీరామ్
జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్
బి.మల్లికార్జున దీక్షిత్
91333 20425