హిందూ దేవుళ్ళు హిందూమతం

ఎవరు రాసారో తెలియదు కానీ అత్యద్భుతంగా ఉంది

blank

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన – ఆదర్శ పురుషుడు

మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన – అద్దం – రాముడు .

ధర్మం పోత పోస్తే రాముడు
ఆదర్శాలు రూపుకడితే రాముడు .
అందం పోగుపోస్తే రాముడు
ఆనందం నడిస్తే రాముడు

వేదోపనిషత్తులకు అర్థం రాముడు
మంత్రమూర్తి రాముడు .
పరబ్రహ్మం రాముడు .
లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు

ఎప్పటి త్రేతా యుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట –

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన
పాట –
రామాలాలీ – మేఘశ్యామా లాలీ

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు – శ్రీరామ రక్ష – సర్వజగద్రక్ష.

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట – అయ్యో రామా

వినకూడని మాట వింటే అనాల్సిన మాట –
రామ రామ

భరించలేని కష్టానికి పర్యాయపదం –
రాముడి కష్టం .

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే – రాముడు

కష్టం గట్టెక్కే తారక మంత్రం
శ్రీరామ .

విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట – శ్రీరామ శ్రీరామ శ్రీరామ .

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట – అన్నమో రామచంద్రా

వయసుడిగిన వేళ అనాల్సిన మాట –
కృష్ణా రామా !

తిరుగులేని మాటకు – రామబాణం

సకల సుఖశాంతులకు – రామరాజ్యం .

ఆదర్శమయిన పాలనకు – రాముడి పాలన

ఆజానుబాహుడి పోలికకు – రాముడు

అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు

రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా –
Rama killed Ravana ;

Ravana was Killed by Rama .

ఆదర్శ దాంపత్యానికి సీతారాములు

గొప్ప కొడుకు – రాముడు

అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు

గొప్ప విద్యార్ధి రాముడు
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .

మంచి మిత్రుడు- రాముడు
(గుహుడు చెప్పాడు).

మంచి స్వామి రాముడు
(హనుమ చెప్పారు).

సంగీత సారం రాముడు
(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం
(పిబరే రామరసం)
సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం – రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం – రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ – రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు – రాముడు జన్మ తరించడానికి – రాముడు , రాముడు, రాముడు .

రామాయణం పలుకుబళ్లు

మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .

తెలుగులో కూడా అంతే .

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే – రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని
అడిగినట్లే ఉంటుంది …

చెప్పడానికి వీలుకాకపోతే –
అబ్బో అదొక రామాయణం .

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే
సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే –
అదొక పుష్పకవిమానం

కబళించే చేతులు , చేష్టలు
కబంధ హస్తాలు .

వికారంగా ఉంటే –
శూర్పణఖ

చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).

పెద్ద పెద్ద అడుగులు వేస్తే –
అంగదుడి అంగలు.

మెలకువలేని నిద్ర
కుంభకర్ణ నిద్ర

పెద్ద ఇల్లు
లంకంత ఇల్లు .

ఎంగిలిచేసి పెడితే –
శబరి

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే – ఋష్యశృంగుడు

అల్లరి మూకలకు నిలయం
కిష్కింధ కాండ

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ –
అగ్ని పరీక్షలే .

పితూరీలు చెప్పేవారందరూ –
మంథరలే.

సాయం చేసినపుడు- ఉడుత భక్తి..
కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..
గొడవ కు దిగే వాళ్ళ పేరు – లంకిని

యుద్ధమంటే రామరావణ యుద్ధమే .

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ –
(రావణ కాష్టాలే .)

కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది
(ఇది విచిత్రమయిన ప్రయోగం ).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు

ఒంటిమిట్టది ఒక కథ ..
భద్రాద్రిది ఒక కథ
అసలు రామాయణమే మన కథ .
అది రాస్తే రామాయణం
చెబితే మహా భారతం

అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు
అది ఒక జీవన విధానం

అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు

రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు

జై శ్రీ రామ్…..

|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది

జై శ్రీరామ్

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
హిందూమతం

భయాన్ని అధిగమించడం: బ్లాక్ మ్యాజిక్‌లో నమ్మకం నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి

ఉపోద్ఘాతం: భయం మరియు బ్లాక్ మ్యాజిక్ యొక్క ఆకర్షణను అర్థం చేసుకోవడం మనలో చాలా మంది జీవితంలో ఒక చెడ్డ సంఘటన మరొకదానిని అనుసరిస్తున్నట్లు అనిపించే సమయాలను
blank
హిందూమతం

హిందూమతం – అన్ని మతాలకు తండ్రి

హిందూమతం తరచుగా పురాతనమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మతంగా పరిగణించబడుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక విశ్వాసాలు, అభ్యాసాలు మరియు తత్వాలపై దాని లోతైన ప్రభావం కారణంగా చాలా