హిందూమతం
భారతీయం

కారుమేఘాలు కమ్ముతున్నాయి. ఏ క్షణంలోనైనా విపరీతంగా వర్షం కురుస్తుంది.
- కారుమేఘాలు కమ్ముతున్నాయి. ఏ క్షణంలోనైనా విపరీతంగా వర్షం కురుస్తుంది. వేసిన ముగ్గు వర్షంలో కలిసిపోతుంది.
అయినప్పటికీ… ఆమె ముగ్గు వేస్తూనే ఉంది!
అదీ… సంప్రదాయం!
- అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వైద్యుడు, అమెరికాలో నివసిస్తున్నా,
ఊరికి వచ్చినప్పుడల్లా తనకు పాఠాలు చెప్పిన పండితుల పాదాలకు నమస్కరిస్తాడు.
అదీ… సంస్కారం!
Advertisement
- ఖగోళశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించిన పండితుడు,
అయినప్పటికీ, గ్రహణం విడిస్తే గానీ ఆహారం గ్రహించడు.
అదీ… నమ్మకం!
- పరమాణు శాస్త్రాన్ని పిండి పిప్పిచేసిన పండితుడు కూడా,
పౌత్రుడి జడ తొలగింపునకు పుణ్యక్షేత్రానికే వస్తాడు.
అదీ… ఆచారం!
Advertisement
- అంతరిక్ష విజ్ఞానాన్ని అరచేత పట్టిన అతిరథుడు కూడా,
పితృదేవతలకు పిండప్రదానం చేస్తాడు.
అదీ… సనాతన ధర్మం!
- అత్తింటికి బయలుదేరే ముందు, ఇంటి ఆడపడుచు పెద్దలకు పాదాభివందనం చేసి పయనమవుతుంది.
అదీ… పద్ధతి!
- పెద్ద చదువులు, గొప్ప ఉద్యోగాలు, ఖ్యాతి ఉన్నా,
పెళ్లి పీటలపై వధువు అందంగా, వినమ్రంగా ఉంటుంది.
అదీ… సంస్కృతి!
Advertisement
- భార్య పక్షవాతం బారిన పడి మంచానికే పరిమితమైపోయినా,
భర్త ఆమెకు భరోసాగా నిలబడి, భారమంతా మోస్తాడు, అన్నీ తానై ఆ పత్ని సేవ చేస్తాడు.
అదీ… దాంపత్యం!
- జీవించే అవకాశాలు తక్కువగా ఉన్నా,
ప్రాణం నిలవాలనే ఆశతో కుటుంబం లక్షలు ఖర్చు చేసి వెంటిలేటర్‌పై ఉంచుతుంది.
అదీ… అనుబంధం!
ఇదంతా… భారతీయతే!




