ఆది శంకరాచార్యులు & నాలుగు మఠాలు – ధర్మ, జ్ఞానం

ఈ మధ్య కాలంలో కొంతమంది స్వాములు… అహంకారపూరిత భేషజంతో…. 👇 "ఆది శంకరాచార్యుల వారు 4 మఠాలను స్థాపించలేదు", "అవి విద్యారణ్యుల వారి కాలంలో వచ్చాయి", అంటూ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో కొంతమంది స్వాములు… అహంకారపూరిత భేషజంతో…. 👇
"ఆది శంకరాచార్యుల వారు 4 మఠాలను స్థాపించలేదు", "అవి విద్యారణ్యుల వారి కాలంలో వచ్చాయి", అంటూ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.
వారందరికీ మన సనాతన ధర్మం తరపున, శాస్త్ర ప్రమాణాలతో ఇస్తున్న సమాధానం ఇది…..
వాస్తవం ఏమిటి?
శంకరులు కేవలం సిద్ధాంతం చెప్పి వెళ్లిపోలేదు. ధర్మ రక్షణ కోసం దేశానికి నాలుగు దిక్కులందు 4 మఠాలను (పీఠాలను) స్థాపించి, ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి "మఠామ్నాయ మహానుశాసనము" అనే గ్రంథమే సాక్ష్యం. దానికి సంబంధించిన పూర్తి శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి:
- తూర్పు దిక్కు (పూరీ - గోవర్ధన పీఠం): శ్లోకం : "పూర్వస్యాం దిశి వైశాఖే కాళికా పీఠముచ్యతే |
జగన్నాథః ప్రభుర్దేవో భోగవారో వనస్థలీ ||
ఋగ్వేద శాఖా కథితా హి తత్ర ధర్మస్య వృద్ధిః |
మహావాక్యం చ ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అస్మిన్ పీఠే ప్రతిష్ఠితమ్ ||" వివరణ : ఆది శంకరులు తూర్పున గోవర్ధన పీఠాన్ని స్థాపించి, దానికి పద్మపాదాచార్యుల వారిని అధిపతిగా చేశారు… వేదం: ఋగ్వేదం | మహావాక్యం: ప్రజ్ఞానం బ్రహ్మ - దక్షిణ దిక్కు (శృంగేరి - శారదా పీఠం): శ్లోకం : "దక్షిణే శృంగేరీ పీఠం శక్తిః శ్రీ శారదా భవేత్ |
వరాహో దేవతా తత్ర రామక్షేత్రముదాహృతమ్ ||
యజుర్వేదస్య పఠనం తత్ర ధర్మానుశాసనమ్ |
అహం బ్రహ్మాస్మి వాక్యం చ తత్రైవ పరికీర్తితమ్ ||" వివరణ: దక్షిణాన శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించి, సాక్షాత్తు సురేశ్వరాచార్యుల వారిని నియమించారు… వేదం: యజుర్వేదం | మహావాక్యం: అహం బ్రహ్మాస్మి - పశ్చిమ దిక్కు (ద్వారక - శారదా మఠం): శ్లోకం : "పశ్చిమాయాం శారదామఠః కీటవారః సముదాహృతః |
తీర్థం చ గోమతీ ప్రోక్తం ద్వారకాక్షేత్రముచ్యతే ||
సామవేదో బ్రహ్మరూపః తత్ర ధర్మముదాహృతమ్ |
తత్త్వమసి మహావాక్యం తత్రైవ పరికీర్తితమ్ ||" వివరణ: పడమర ద్వారకా పీఠాన్ని స్థాపించి, హస్తామలకాచార్యుల వారిని కూర్చోబెట్టారు. వేదం: సామవేదం | మహావాక్యం: తత్త్వమసి - ఉత్తర దిక్కు (బదరి - జ్యోతిర్ మఠం): శ్లోకం : "ఉత్తరే జ్యోతిర్మఠం చ బదరికాశ్రమ ముచ్యతే |
నారాయణః ప్రభుర్దేవో పూర్ణగిరిశ్చ శక్తికా ||
అథర్వణ వేద వాక్యాని తత్ర స్వీకురుతే సదా |
అయమాత్మా బ్రహ్మ వాక్యం జ్యోతిర్మఠే ప్రతిష్ఠితమ్ ||" వివరణ: ఉత్తరాన జ్యోతిర్మఠాన్ని స్థాపించి, తోటకాచార్యుల వారికి బాధ్యత ఇచ్చారు… వేదం: అథర్వణ వేదం | మహావాక్యం: అయమాత్మా బ్రహ్మ తర్కం (Logic) - అబద్ధం చెప్పే వారికి సూటి ప్రశ్న: విద్యారణ్య స్వామి శృంగేరి పీఠ పరంపరలో 12వ జగద్గురువులు. పీఠం అప్పటికే ఉంటేనే కదా ఆయన 12వ వారు అవుతారు? లేకపోతే ఆయనకు సన్యాస దీక్ష ఎవరు ఇచ్చారు? గురు పరంపర లేకుండా పీఠాధిపతి ఎలా అవుతారు? విద్యారణ్యులు పీఠాన్ని పునరుద్ధరించారు తప్ప, స్థాపించలేదు. స్థాపకుడు సాక్షాత్తు శంకర భగవత్పాదులే! శంకరులు కేవలం వైష్ణవులా?!కాదు! 72 పాషండ మతాలను ఖండించి.. అందరినీ మెప్పించి ఒప్పించి ఒకే త్రాటి పైనిల్పిన పరమ అద్వైత జ్ఞానమూర్తి!ఆదిశంకరులు! వారు "షణ్మత స్థాపనాచార్యులు". శివుడిని "శివానందలహరి"లో, అమ్మవారిని "సౌందర్యలహరి"లో, విష్ణువును "భజ గోవిందం"లో స్తుతించిన అద్వైతులు వారు. వారిని ఒక దేవుడికి పరిమితం చేయడం అవివేకం… దయచేసి ఇలాంటి చారిత్రక వక్రీకరణలను నమ్మకండి. మన ధర్మాన్ని, మన గురు పరంపరను కాపాడుకుందాం.
శ్లోll శివాయవిష్ణురూపాయ
శివరూపాయవిష్ణవేl
శివస్యహృదయంవిష్ణుః
విష్ణోశ్చహృదయగ్ంశివఃll
యథాశివమయోర్విష్ణురేవంవిష్ణుమయశ్శివఃl
యధాంతరన్నపశ్యామితధామేస్వస్తిరాయుషిll
శ్రీ ఆదిశంకర పరివార్! శ్రీ శివాయ గురవే నమః 🙏 🚩 జయ జయ శంకర హర హర శంకర…. హరిః ఓం 🙏 నగురోరథికమ్ 🚩 💓
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏




