శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం | యమ్.యస్ సుబ్బులక్ష్మి

1970 సంవత్సరంలో మద్రాసు నగరంలోని మైలాపూర్ లోని "శ్రీరామకృష్ణ మఠం" అధ్యక్షులు "శ్రీ కైలాసానంద" వారి చొరవతో శ్రీమతి. యమ్.
1970 సంవత్సరంలో మద్రాసు నగరంలోని మైలాపూర్ లోని "శ్రీరామకృష్ణ మఠం" అధ్యక్షులు "శ్రీ కైలాసానంద" వారి చొరవతో శ్రీమతి. యమ్.యస్ సుబ్బులక్ష్మి గారిని సంప్రదించి 'శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం' గాత్రం చేయమని సూచన చేస్తే సుబ్బులక్ష్మి గారు పరమానందభరితురాలై అనుమతి తెలిపారు.
వెంటనే మద్రాసు నగరంలో స్టూడియోలో ఈ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం పాడటం రికార్డింగ్ శ్రీకారం చుట్టారు.
ఈ ఫోటో వేదికపై కూర్చున్న వారిలో 'యస్. సుబ్బులక్ష్మి గారు' పక్కనే కూతురు రాధా జయలక్ష్మి గారు రికార్డింగ్ ఇంజనీర్ రఘు గార్లు. అలాగే, కింద వైపు కూర్చొని ఉన్నవారిలో సుబ్బులక్ష్మి గారి సంస్కృత పండితులైన గురువులు 'శ్రీమాన్. అగ్నిహోత్రి తాతాచార్య స్వామివారు', సుబ్బులక్ష్మి వారి భర్త గారు 'శ్రీ సదాశివం', గార్లని మనం చూడవచ్చును.
👆ఫోటోలో సుబ్బులక్ష్మి గారికి సూచనలు చేస్తున్న రికార్డింగ్ ఇంజనీర్ రఘు గారు




