“ఏడేడు జన్మలు” అర్థం ఏమిటి? 7 జీవరాశులు & 14 లోకాల రహస్యం

🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀 "ఏడేడు జన్మలు" అనే పదబంధం గురించి ఆలోఛిద్దాం !
🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀
"ఏడేడు జన్మలు" అనే పదబంధం గురించి ఆలోఛిద్దాం !
నిజానికి ఏడు జన్మలు. ఏడు జన్మల బంధం" అని వాడుకలో అంటుంటాం.
జీవరాశుల వర్గీకరణ
శాస్త్రాల ప్రకారం ప్రాణులు 84 లక్షల జీవరాశులుగా పుడతాయి.
వీటిని ప్రధానంగా 7 రకాల వర్గాలుగా విడదీశారు:
దేవతలు
మనుషులు
పశువులు (జంతువులు)
పక్షులు
సరీసృపాలు (పాకేవి)
జలచరాలు (నీటిలో ఉండేవి)
స్థావరాలు (చెట్లు, గిరిజాల వంటివి)
వీటినే వాడుకలో ఏడు జన్మలు అంటారు.
"ఏడేడు" అంటే 14 అని అర్థం (7 + 7)
దాశరథి గారు "ఏడేడు" అని వాడటం ద్వారా ఆ బంధం యొక్క గాఢతను, అనంత కాలం పాటు ఉండే అనురాగాన్ని నొక్కి చెప్పారు.
విశ్వంలో 14 లోకాలు (అతలం, వితలం వంటివి 7, భూమి పైన స్వర్గాది లోకాలు 7) ఉన్నాయని పురాణాలు చెబుతాయి.
ఏ లోకంలో, ఏ జన్మ ఎత్తినా మన బంధం ఇలాగే ఉండాలని కవి భావం.
🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀




