అంతర్వేది 👉 ఏకాదశి – లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య రథోత్సవ వేళ
వశిష్ఠ గలగలలు… సాగరం సవ్వళ్లు… వాటిని మరిపించేలా గోవింద నామస్మరణ. ఇది ప్రఖ్యాత నృసింహ క్షేత్రం అంతర్వేది వైభవం. దేవదేవుడి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధమైన తరుణంలో, తూర్పుగోదావరి జిల్లాలోని ఈ క్షేత్రం వేలాది మంది భక్తులతో ఇల వైకుంఠంగా మారనుంది. సత్యానికి సంకేతం – నృసింహ స్వామి మహిమ అలాంటి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వెలసిన ప్రఖ్యాత క్షేత్రాల్లో అంతర్వేది ఒకటి. నిత్య హోమాలతో, ఆధ్యాత్మిక పరిమళాలతో భక్తులను సాంత్వనపరిచే స్వామివారి వైభవం ఇక్కడ చూసి […]