జీవితం లో నిజమైన సంతోషం డబ్బుతో కాదు | ప్రేరణాత్మక సందేశం

🔔 జీవితం 🔔 🍃🥀 చిన్న చిన్న సంతోషాలు కూడా డబ్బు ఖర్చు పెడితేనే దొరుకుతాయి అని కొంతమంది అనుకుంటున్నారు… 😷 🔹 నీకు నచ్చిన దేవుడిని మనసులో పూజించడానికి ఎంత ఖర్చు అవుతుంది?
🔔 జీవితం 🔔
🍃🥀 చిన్న చిన్న సంతోషాలు కూడా డబ్బు ఖర్చు పెడితేనే దొరుకుతాయి అని కొంతమంది అనుకుంటున్నారు… 😷
🔹 నీకు నచ్చిన దేవుడిని మనసులో పూజించడానికి ఎంత ఖర్చు అవుతుంది?
🔸 నీ పక్కనే ఉన్న వాళ్లతో పది నిమిషాలు ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడటానికి ఎంత ఖర్చు అవుతుంది?
🔹 ఇంట్లో వండుకున్న భోజనాన్ని ఇంట్లో వాళ్లతో కలిసి కూర్చొని తినడానికి ఎంత ఖర్చు అవుతుంది?
🔸 ఇంట్లో పెంచుకున్న మొక్కలతో ఒక గంట కాలక్షేపం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
🔹 ఒక మంచి పుస్తకం చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది?
🔸 భర్తతో / భార్యతో, అమ్మతో / నాన్నతో ప్రేమగా ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది?
🔹 సాటి మనిషిని “ఎలా ఉన్నారు?” అని ఆప్యాయంగా అడగడానికి ఎంత ఖర్చు అవుతుంది?
🔸 చిన్నప్పటి స్నేహితులు గుర్తొస్తే, వాళ్లను పలకరించడానికి ఎంత ఖర్చు అవుతుంది?
🔹 మన దగ్గర ఉన్న దాంట్లోంచి, తిండి లేనివాళ్లకు కొంచెం తిండి పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది?
🍃🥀 పైసా ఖర్చు లేకుండానే ఎన్నో సంతోషాలు, సరదాలు, మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చేయొచ్చు. ఇంకా ఎన్నో ఉన్నాయి…
👉 అన్నిటికీ డబ్బే అవసరం లేదు.
👉 డబ్బుతోనే పని లేదు.
🔹 డబ్బు అవసరం నీకు ఎప్పుడంటే…
నీ స్థాయి కంటే, నీ స్థాయిని దాటి లగ్జరీగా బతకాలి అనుకున్నప్పుడే… అంతే…
🙏🏻🙏🏻🙏🏻 🔔🔔🔔 🙏🏻🙏🏻🙏🏻




