కోతుల సహజ మరణాన్ని మీరు ఎప్పుడైనా చూశారా…….!!
వాటికి వారం ముందే తెలిసిపోతుంది….
అలా తెలుసుకున్నాక ఎవరి కంట పడకుండా, సంచారం లేనిచోట ఏ ఆహారం తీసుకోకుండా,తనకు కావలసిన గంతను తవ్వి అందులో పడుకుండి పోతాయట. అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుంది.

*ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తాయి….

ఎవరైనా గెంతుతుంటే లేక అల్లరి చేస్తుంటే కోతులతో పోలుస్తాము.ఒక్క నిమిషం ఒకచోట కూర్చోడు కోతిలాగా గెంతుతూనే ఉంటాడు అని.

అలాంటిది ఒక వారం ఒకే చోట కదలకుండా ఉండిపోతాయంటే ఆశ్చర్యం వేసింది.

ఇది నిజమా కాదా అని ఆలోచిస్తే…..!!!

ఆంజనేయుడు శ్రీ రాముడు వద్ద అడిగి పొందిన వరం అని!!

నా దేహం ఎవరి కంట పడనీక అని వరం అడిగాడు ఆ హనుమయ్య.

అందుకే ఒక్క కోతి ప్రమాదంలో చనిపోయినా మిగతా కోతలు కలిసి పుట్టమన్ను ఉన్న చోటుకు తీసుకుని వెళ్లి దేహం పూర్తిగా కప్పబడేవరకు కదలిరావట.

అందులకే కోతులకు ఇష్టమైన అరటిపండ్లు అందివ్వాలని అంటారు.

అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడ కోతి ప్రతిక్షమౌతుందని విన్నాను.

అందుకేనేమో హనుమను మించిన భక్తుడు లేడు అంటారు.

జై శ్రీ రామ్

తరచుగా అడిగే ప్రశ్నలు

కోతులకు తమ మరణం ముందే తెలుస్తుందా?

ప్రచారంలో ఉన్నట్లుగా కోతులకు తమ సహజ మరణం వారం ముందే తెలిసిపోతుంది. ఆ తర్వాత అవి ఎవరి కంట పడకుండా, సంచారం లేనిచోట ఆహారం తీసుకోకుండా ఉంటాయని చెబుతారు.

కోతులు చనిపోయే ముందు ఏం చేస్తాయి?

ప్రచారంలో ఉన్నట్లుగా అవి తమకు కావలసిన గుంతను తవ్వి అందులో పడుకుండిపోతాయి, ఆ ఒక్క వారం కదలకుండా తపస్సు చేస్తాయి. చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుందని నమ్మకం.

కోతుల మరణానికి హనుమంతుని వరానికి సంబంధం ఏమిటి?

ప్రచారంలో ఉన్నట్లుగా ఆంజనేయుడు శ్రీరాముని వద్ద 'నా దేహం ఎవరి కంట పడనీక' అనే వరం పొందాడు. అందుకే కోతుల దేహాలు ఎవరికీ కనిపించవని భక్తులు నమ్ముతారు.

ప్రమాదంలో కోతి చనిపోతే మిగతా కోతులు ఏం చేస్తాయి?

ప్రచారంలో ఉన్నట్లుగా మిగతా కోతులు కలిసి ఆ దేహాన్ని పుట్టమన్ను ఉన్న చోటుకు తీసుకువెళ్లి, అది పూర్తిగా కప్పబడే వరకు అక్కడి నుంచి కదలవు.

కోతులకు అరటిపండ్లు ఎందుకు ఇవ్వాలంటారు?

కోతులను హనుమంతుని స్వరూపంగా భావించే భక్తి వల్ల, వాటికి ఇష్టమైన అరటిపండ్లు అందివ్వాలని పెద్దలు చెబుతారు.

రామాయణ పారాయణం జరిగే చోట కోతి కనిపిస్తుందా?

రామాయణం చదువుతున్నా లేదా ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతున్నా అక్కడ కోతి ప్రత్యక్షమవుతుందని భక్తుల్లో ప్రచారంలో ఉంది. అందుకే హనుమను మించిన భక్తుడు లేడని అంటారు.