శివరాత్రి వ్రత నియమాలు క్లుప్తంగా తెలుసుకుందాం
-వ్రతం ఆచరించేవారికి ఫలం-

 శివరాత్రి వ్రతం నామ సర్వపాప ప్రణాశనమ్ |
 నైతస్మాదధికం కించిత్ ముక్తిముక్తి ప్రదాయకమ్ ||"

Advertisement

శివరాత్రి వ్రతం అన్ని పాపాలను నశింపజేస్తుంది…. ఐహిక భోగాలను ఆముష్మిక సుఖం ప్రసాదించడంలో దీనికంటే మించినది మరొకటి లేదు…

      శివరాత్రి అనుమతి అనుగ్రహం కోసం
               ప్రాతః కాల శివప్రార్ధన

శివరాత్రివ్రతం హ్యేతత్ కరిష్యేऽహం మహాఫలమ్|
నిర్విఘ్నమస్తు మే చాత్ర త్వత్ప్రసాదాజ్జగత్పతే||"

Advertisement

"ఓ జగత్పతీ! నేను మహా ఫలప్రదమైన ఈ శివరాత్రి వ్రతాన్ని చేస్తున్నాను…నీ అనుగ్రహంతో ఇది ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలి…."

👉 నిత్య కృత్యాలు ముగించి శివపూజా విధి ఆచరించాలి

                   !!***//***!!

    👉   పూజ ఎలా చేయాలి

"స్నాపయేత్పంచగవ్యైశ్చ పంచామృతమయైస్తథా |
శుద్ధోదకేన చ తతః శివలింగం ముదాన్వితః ||"

Advertisement

      🌻పరమశివుడిని పంచగవ్యాలతో🌻


✓ పంచామృతాలతో మరియు శుద్ధ జలంతో భక్తిశ్రద్ధలతో అభిషేకించాలి….

"అక్షతైశ్చ సుగంధైశ్చ పుష్పైర్బిల్వైస్తథైవ చ|
ధూపైశ్చ వివిధైర్దీపైర్నైవేద్యైశ్చ పృథగ్విధైః||"

✓ అక్షతలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, ముఖ్యంగా బిల్వ పత్రాలతో పూజించి, వివిధ రకాల ధూపాలు, దీపాలు మరియు నైవేద్యాలను సమర్పించాలి….

Advertisement
                    !!***//***!!

 [ ఉపవాసంతో పూజను ఆచరించాలి ]

న స్నానైర్న చ వస్త్రైశ్చ న ధూపైర్న చ మోదకైః|
తుష్యామి న తథా పుష్పైర్యథా తత్రోపవాసతః||"

✓ "అభిషేక స్నానాల వల్ల కానీ,వస్త్రాల వల్ల కానీ,ధూప దీప నైవేద్యాల వల్ల కానీ నేను అంతగా సంతోషించను…శివరాత్రి నాడు భక్తితో చేసే 'ఉపవాసం' వల్ల కలిగే సంతోషం నాకు మరి దేనివల్లా కలగదు" అని శివుడు స్వయంగా తెలిపారు….

                  !!***//***!!

   ఉపవాసానికి ప్రత్యామ్నాయాలు

వ్యాధితైశ్చైవ బాలైశ్చ వృద్ధైశ్చైవ తథైవ చ |
ఫలమూలాశనైః కార్యమశక్తైర్వ్రతముత్తమమ్ ||"

✓ వ్యాధిగ్రస్తులు చిన్నపిల్లలు, వృద్ధులు మరియు శారీరకంగా ఉపవాసం ఉండలేని వారు పండ్లు, కందమూలాలు లేదా పాలు స్వీకరిస్తూ ఈ ఉత్తమమైన వ్రతాన్ని ఆచరించవచ్చు….

"నక్తం హవిష్యాన్నమౌదనం వా ఫలం తిలాః క్షీరమథాంబు చైవ|
పంచ ప్రశస్తాని హవీంషి యాని వ్రతేషు సర్వేషు ఫలప్రదాని||"

✓ ఏ వ్రతంలోనైనా సరే, పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఈ ఐదు వస్తువులను స్వీకరించవచ్చు పండ్లు, పాలు, నీరు, నువ్వులు, హవిష్యాన్నం,
వీటిని స్వీకరించడం వల్ల వ్రత భంగం కలగదు, పైగా ఫలం కూడా దక్కుతుంది….

🌻🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🌻

              విశేషమైన పూజలు ఏ విధంగా చేయాలి

శక్తి ఉన్నవారు 4 మార్లు పూజ చేయవచ్చు
👉 చతుర్యామ పూజా ఫలితం

👉 రాత్రిని నాలుగు భాగాలుగా చేసి పూజించడం వల్ల కలిగే ఫలితం:

ఏవం యః కురుతే భక్త్యా చతుర్యామమపి వ్రతమ్|
ముక్తిం ప్రాప్నోతి స త్యక్త్వా పునరావృత్తిదుఃఖదమ్||

👉 మహాశివరాత్రి ప్రదోషం సా 06. 10 నుంచి 08.39

👉 మహాశివరాత్రి మొదటి యామం సా6. 10 నుంచి 9.16

👉 మహాశివరాత్రి రెండవ యామం రా9.16 నుంచి 12.21

👉 మహాశివరాత్రి నిశీధి సమయం రా11.57 నుంచి 12.46

👉 మహాశివరాత్రి మూడవ యామం రా12.21 నుంచి 3.27

👉 మహాశివరాత్రి నాల్గవ యామం రా.తె3.27 నుంచి ఉ6.33

ఈ విధంగా ఎవరైతే భక్తితో నాలుగు జాముల పూజను నిర్వహిస్తారో, వారు సంసార బంధాల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు….

                    !!***//***!!

            👉  భక్తియే ప్రధానం 👈

"యథా శక్తి చరేద్భక్త్యా వ్రతం మే పరమేశ్వర |
తుష్యామి న తథా పుష్పైర్యథా భక్త్యా మదుత్తమే ||"

✓ "ఓ పరమేశ్వరా! నా శక్తి కొద్దీ భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తాను బాహ్యమైన పుష్ప ఉపచారాల కంటే, మనసులోని భక్తితో నేను త్వరగా మీకు సంతుష్టుడనవుతాను…."

                 !!***//***!!

                  👉 జాగరణ 👈

రాత్రౌ జాగరణం కుర్యాత్పురాణశ్రవణాదిభిః |
నృత్యైర్గీతైశ్చ వాద్యైశ్చ శివతుష్టిక రైర్మునే||"

✓ రాత్రి సమయంలో పురాణ శ్రవణం భజనలు,కీర్తనలు మరియు శివునికి ప్రీతికరమైన నృత్య వాద్య విశేషాలతో జాగరణ చేయాలి….

 గీత వాద్యైశ్చ నృత్యైశ్చ పురాణ పఠనైస్తథా|
 నీత్యా జాగరణం కుర్యాత్ శివ ప్రీతికరమ్ మునే||"

✓ భజనలు,శివకథలు వినడం మరియు శివ నామ జపం చేస్తూ సమయాన్ని గడపాలి…. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు…

      👉  జాగరణ విశేషములు 👈

"యః పునః శివలింగస్య సన్నిధౌ జాగరమ్ చరేత్|
తస్య పుణ్యఫలం వక్తుం న శక్యమ్ వర్షకోటిభిః||"

 ఎవరైతే శివలింగం సాన్నిధ్యంలో[ఆలయంలో] రాత్రంతా జాగరణ చేస్తారో, వారి పుణ్యఫలాన్ని వర్ణించడం కోటి సంవత్సరాలకైనా సాధ్యం కాదు....వారు చేసిన జ్ఞాతాజ్ఞాత పాపాలన్నీ భస్మమైపోతాయి....

  👉 పునర్జన్మ రాహిత్యం (మోక్షం) 👈

" శివాలయ సమీపే తు జాగరం యః కరోతి హి |
స సర్వ పాప నిర్ముక్తో శివలోకం స గచ్ఛతి||"

✓ శివాలయానికి దగ్గరగా ఉండి జాగరణ చేసేవారు సర్వపాపాల నుండి విముక్తులై, మరణానంతరం శివలోకాన్ని చేరుకుంటారు…వారికి పునర్జన్మ ఉండదు…

 పుణ్యక్షేత్రం లో ఉండే వారికి మోక్షం నిశ్చయం

🌻🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷🌴🌹🌿🌴🥀🍀🌻

 శివ పూజ ఇంట్లో చేసినా వారు కూడా  శివాలయ దర్శనం చేయాలని అంటారు ఎందుకు???

👉  శివాలయ దర్శన విశేషం 👈

"శివాలయసమీపస్థః శివరాత్రిం కరోతి యః|
స సర్వపాపనిర్ముక్తో గచ్ఛేచ్ఛివపురం ప్రతి||"

✓ ఎవరైతే శివరాత్రి పర్వదినాన శివాలయ సమీపంలో ఉండి వ్రతాన్ని ఆచరిస్తారో లేదా ఆలయాన్ని దర్శిస్తారో,వారు సర్వ పాపాల నుండి విముక్తులై శివలోకాన్ని పొందుతారు…..

 👉  శివలింగ దర్శన ప్రభావం 👈

"దర్శనాన్ముక్తిదం లోకే శివలింగం విశేషతః |
మహాశివరాత్రౌ తద్దర్శనం కోటిజన్మాఘనాశనమ్ ||"

✓ "లోకంలో శివలింగ దర్శనం ముక్తిదాయకం….అందునా మహాశివరాత్రి రోజున ఆలయంలో శివలింగాన్ని దర్శించడం వల్ల కోటి జన్మల పాపాలు నశిస్తాయి….

 ఆలయ నియమాలు అతిక్రమించి ప్రవర్తించ రాదు

 ***********

           👉   వ్రత సమాప్తి  👈

"సంసారక్లేశదగ్ధస్య వ్రతేనానేన శంకర |
ప్రసీద సుముఖో భూత్వా జ్ఞానదృష్టిప్రదో భవ ||"

✓ "ఓ శంకరా! సంసారంలోని కష్టాలతో సతమతమవుతున్న నాపై కరుణ చూపి,ఈ వ్రతం వల్ల ప్రసన్నుడవై నాకు జ్ఞాన దృష్టిని ప్రసాదించు….🧘‍♂️🙏

ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏