సుభాషితమ్

శ్లోకం 𝕝𝕝 🌿
📖 సత్యం బ్రవీమి, సకలశ్రుతి నిర్ణయోక్త
సారం బ్రవీమి, జనతా తరణం బ్రవీమి
కాశీ విముక్తినగరీ తరణోపదేష్టా
విశ్వేశ ఏవ హి కలౌ న త తోస్తి కించిత్ |
✨ భావం:
దయాసముద్రుడైన పరమేశ్వరుడు జనన-మరణ ప్రవాహ రూప సంసారసాగరంలో నిమగ్నమైన జీవులను ఉద్ధరించుటకై అనేక తీర్థక్షేత్రాలను సృష్టించాడు. ఇవన్నీ పాపక్షయహేతువులు, స్వర్గప్రదములు, క్రమముక్తి మార్గాలు మాత్రమే. కానీ, సాక్షాత్ మోక్ష ప్రదాయిని కాశీ ఒక్కటే!
🌸 విశ్వేశ్వరుడే ఏకైక తారకోపదేశకుడు 🌸
కలియుగంలో కాశీ సమానమైన మరో మోక్ష మార్గం లేదు!
🔱 🙏 హర హర మహాదేవ! 🙏 🔱