నా... నాన్న

జీవితంలో "అమ్మ" అన్న పిలుపు తర్వాత మరొక గొప్ప అద్భుతమైన పిలుపు "నాన్న" ముందుగా, నాన్నని గౌరవించాలంటే "డాడీ" అని పిలవడం మానేసి, నోరారా "నాన్న" అని పిలవండి.
జీవితంలో "అమ్మ" అన్న పిలుపు తర్వాత మరొక గొప్ప అద్భుతమైన పిలుపు "నాన్న"
ముందుగా, నాన్నని గౌరవించాలంటే "డాడీ" అని పిలవడం మానేసి, నోరారా "నాన్న" అని పిలవండి.
"నాన్న" అనే పిలుపులో నా వాడు, ఆత్మీయుడు అనే భావం ఉంటుంది. ఇది పిలిచే వాళ్లకు, పిలిపించుకునే వాళ్లకు హృదయపూర్వక సంతోషాన్ని కలిగిస్తుంది.
నాన్న గురించి తెలుసుకోవాలంటే...
నాన్నను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక పీహెచ్.డి చేయాలి!
అమ్మలా అన్నీ బయట చెప్పుకోలేడు – అన్నీ మనసులోనే ఉంచుకుంటాడు.
నాన్నను ఒక టెంకాయ (కొబ్బరి కాయ) లాంటి వాడిగా అనుకోవచ్చు.
- బయటకు గట్టిగా, రాయిలా కనిపిస్తాడు.
- కానీ లోపల నీళ్లా మృదువుగా ఉంటాడు.
- నాన్న కన్నీళ్లను హృదయంలో దాచుకుంటాడు.
- తన మనసు కొబ్బరి తీయదనాన్ని పోలినదే!
కుటుంబంలో అందరూ – అమ్మతో సహా – నాన్నను అడుగుతూనే ఉంటారు.
ఆయన "లేదు, నా వల్ల కాదు" అని ఎప్పుడూ చెప్పడు.
చిరునవ్వుతో "అవును, చూసుకుందాం" అని సమాధానం చెబుతాడు.
అలా చెప్పడం వల్ల మనకెంతో సంతోషం కలుగుతుంది.
మీరు కోరిన కోరిక తీర్చడానికి నాన్న ప్రాణం పెట్టి కష్టపడతాడు.
నాన్న – ఒక బాధ్యతగల వ్యక్తి
తన కుటుంబం బాగుండాలని, సమాజంలో మంచి స్థాయిలో ఉండాలని ప్రతి నాన్న కోరుకుంటాడు.
దానికోసం అతను పడే కష్టాలు, తన జీవితంలోని ఒడిదుడుకులు మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి.
కొన్ని తప్పులు చేయడం, కొన్ని నష్టాలు ఎదుర్కోవడం సహజమే.
ఇటువంటి సమయంలో నాన్నను అర్థం చేసుకుని సహకరిస్తే,
ఆయన హృదయం ఉప్పొంగిపోతుంది.
నాన్నని ఒక మనిషిగా చూడండి, దేవుడిగా కాదు!
కొన్ని నాన్నలు మందు, సిగరెట్‌కి బానిస అవుతారు.
ఇది కావాలని కాదు, కష్టాలను ఓర్చుకోలేక, ఒత్తిడిని భరించలేక అవుతారు.
చాలామంది నాన్నలు ఇంటికి లేటుగా వస్తారు, అందరూ పడుకున్నాకే ఇంటికొస్తారు.
కారణం? పట్టించుకునే మనసులు లేకపోవడం, కుటుంబ బాధ్యతలు.
నాన్న కూడా ఒక మనిషే!
మీ కుటుంబంలో నాన్న పెద్దవాడైనా,
బయటి ప్రపంచంలో చాలా మంది నాన్నలు చిన్నవాళ్లే.
నాన్న విలువ ఎప్పుడు అర్థమవుతుంది?
నిజంగా నాన్న విలువ తెలుసుకోవాలంటే,
ఆయన జీవించి ఉన్నప్పుడే గుర్తించాలి.
ఆయన లేకపోయిన తర్వాతే నాన్న గొప్పతనం తెలుస్తుంది.
కుటుంబం & నాన్న
నాన్న కుటుంబానికి అండగా ఉండాలి,
అలాగే, కుటుంబ సభ్యులు నాన్నకు అండగా ఉండాలి.
అలా జరిగితే ప్రతి ఇంటి పై నాన్న అనే జెండా ఎప్పుడూ ఎగురుతూ ఉంటుంది!
💙 జై నాన్న! జై జై నాన్న! 💙
📌 - బి. మల్లికార్జున దీక్షిత్
📌 (కౌన్సిలింగ్ సైకాలజిస్ట్)
📌 📞 సెల్: 9133330425




