సమాచారం మరియు సేకరణ

బ్రాహ్మణ జాతి అభివృద్ధికి నా మనఃపూర్వక సూచనలు

blank

బి. మల్లికార్జున దీక్షిత్
(ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్)

1️⃣ బ్రాహ్మణులు ధైర్యాన్ని, ఐక్యతను పెంపొందించుకోవాలి.
ఒకరికైనా సమస్య వచ్చినపుడు మిగతావారందరూ కలసి ఉండాలి. అవసరమైతే ఆర్థికంగా కూడా తోడ్పాటును అందించాలి. ఐక్యతే శక్తి.

2️⃣ చదువు మరియు ఉద్యోగాల్లో నిపుణులు కావాలి.
అర్చకత్వం, శుభకార్యాల్లో పాల్గొనడమే కాక, ఖాళీ సమయంలో పార్ట్‌టైమ్ జాబ్స్, వాణిజ్య అవకాశాల ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి.

3️⃣ వ్యాపారాల్లోకి అడుగుపెట్టి పరస్పర సహకారం పెంపొందించాలి.
కేవలం ఉద్యోగాలపై ఆధారపడకుండా, బ్రాహ్మణులు చేపట్టే వ్యాపారాల్లో బ్రాహ్మణులకే ప్రాధాన్యం ఇవ్వాలి. వారు నడిపే దుకాణాల్లోనే వస్తువులు కొనుగోలు చేయాలి.
ఇది నిరుద్యోగ సమస్యకు పరిష్కారం అవుతుంది.

4️⃣ వివాహ సంబంధాల్లో సంస్కృతి రక్షణ అత్యవసరం.
బ్రాహ్మణ యువతులు బ్రాహ్మణ యువకులను మాత్రమే వివాహ భాగస్వాములుగా ఎంచుకోవాలి. పౌరోహిత్యం చేసే వారు కూడా ప్రస్తుతం ఆర్థికంగా స్థిరంగా ఉన్నారు — వారి పెళ్లిళ్లను ఖచ్చితంగా ఆమోదించాలి.

5️⃣ వివాహితులు కనీసం ఇద్దరు సంతానాన్ని కలిగి ఉండాలి.
ఇది వంశ పరంపరతో పాటు జాతి అభివృద్ధికి కీలకము.

6️⃣ ధనవంతులైన బ్రాహ్మణులు పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలి.
ఆర్థికంగా, విద్యా సహాయం రూపంలో లేదా ఇతర విధాలైన సహకారాన్ని అందించాలి. కష్టాల్లో ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి అండగా నిలవాలి.

7️⃣ బ్రాహ్మణుల కోసం ఉన్న సేవా సంస్థల సహకారాన్ని పొందాలి.
అవసరమైన వారు వాటి ద్వారా లబ్ధి పొందడం ద్వారా జీవనోపాధి మెరుగవుతుంది.

8️⃣ బ్రాహ్మణులను హేళన చేసినపుడు మౌనం వహించరాదు.
“మనకెందుకులే” అనే భావనను విడిచిపెట్టి, తగిన పద్ధతిలో స్పందించాలి. అన్యాయం జరిగినపుడు నిర్భయంగా స్పందించి బ్రాహ్మణ గౌరవాన్ని నిలబెట్టాలి.

9️⃣ సంఘబద్ధతతో రాజకీయాల్లోకి అడుగుపెట్టు.
బ్రాహ్మణులంతా సంఘాలుగా ఏర్పడి, రాజకీయాల్లో పాల్గొనాలి. శాసనసభ, పార్లమెంటులో బ్రాహ్మణులకు రిజర్వేషన్ల కోసం కృషి చెయ్యాలి.

🔟 వేదాధ్యయనంతో సంస్కృతికి జీవం పోసే బాధ్యత మనదే.
వేదాలు పఠించడం, ఆచరణలో పెట్టడం ద్వారా మన సంస్కృతిని నిలబెట్టాలి. బ్రాహ్మణులు లేని సరిహద్దులో ఎలాంటి శుభా-అశుభ కార్యక్రమాలూ జరిగే అవకాశం లేదు.


ముగింపు సందేశం

బ్రాహ్మణులు శాఖాభేధాలను పక్కనపెట్టి ఐక్యంగా నిలబడినప్పుడే బ్రాహ్మణ జాతి అభివృద్ధి పథంలో నడిచే శక్తి సాధ్యమవుతుంది.
ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
సమాచారం మరియు సేకరణ హిందూమతం

విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం

ఆత్మీయ హిందూ బంధువులకు నమస్కారం రేపు ఉదయం విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం కార్యక్రమానికి విచ్చేయుచున్న హిందూ బంధువుల కొరకు ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ, శ్రీ
blank
మహా కుంభమేళా సమాచారం మరియు సేకరణ

ప్రయాగ రాజ్ లో తెలుగు పురోహితులు

కుంభ మేళా లో ప్రయాగ్ రాజ్ కు వెళ్ళే తెలుగు వాళ్ళకి అద్భుతమైన అవకాశం. విజయవాడ కు చెందిన తెలుగు బ్రాహ్మణ పురోహితులు బృందం ప్రయాగ రాజ్