ఎందుకయా సాంబశివా

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి హృదయాన్ని తాకే పదబంధం(ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి తరచుగా ప్రసారమైన గీతం)
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివా
సాంబశివా… సాంబశివా…
అలలతోటి గంగ పట్టి
తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవుగా
కలికి తురాయిగ పెట్టి –
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
సాంబశివా… సాంబశివా…
తోలు గట్టి పటకాగా
కాలాగ్నిని కుట్టి
కేల త్రిశూలము పట్టి
ఫాలమందు కీల పెట్టి –
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
సాంబశివా… సాంబశివా…
రుద్రుడవో? కారుణ్య సముద్రుడవో?
హర హర హర…
ఎందుకయా ఈ దాసుని
కందవయా దయామయా…
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
సాంబశివా… సాంబశివా…
🌹 – మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి
🎻 శివ తత్వాన్ని ప్రశ్నించే పూజ్యమైన పాట
🚩 భక్తితో చదవదగ్గ అక్షరాల కవిత్వం