వేదో నిత్యమధీయతాం, తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్!!

వేదాధ్యయనం నిత్యము చేయడం, వేదములలో చెప్పిన కర్మలను నిష్ఠతో అనుష్ఠించడం — ఈ రెండూ విప్రులకు భగవంతుడు ప్రసాదించిన అపూర్వమైన సదవకాశాలు. 🙏
అందరికీ నమస్కారం.
కర్నూలు నగరంలో, శ్రీశ్రీశ్రీ కంచి కామకోటి పీఠాధిపతుల వారి అనుగ్రహంతో, మన అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం వారు, వేదాభివృద్ధి కోసం గత నాలుగేళ్లుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఋగ్వేద స్మార్తం, యజుర్వేద స్మార్తం విభాగాలలో శ్రద్ధగా సేవ చేస్తున్నట్లు తెలియజేస్తూ గర్వంగా పేర్కొంటున్నాము.
ఈ శ్రీకంచి కామకోటి పీఠ శంకర వేదవిద్యాలయం నందు, ఇప్పుడు అథర్వవేదం మరియు కృష్ణయజుర్వేద స్మార్త విభాగాలలో కొత్త విద్యార్థుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము.
వేద విద్యలో ఆసక్తి కలిగినవారు, దిగువ పేర్కొన్న అధ్యాపకుల ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు:
అథర్వవేద అధ్యాపకులు:
కాశీభట్ల పవన్ శర్మ గారు – 📞 84990 85608
కృష్ణయజుర్వేద స్మార్త అధ్యాపకులు:
పాలపర్తి శివరామ శర్మ గారు – 📞 70930 89380, 70130 06638