తిరుమలకు వెళ్తున్న బ్రాహ్మణులకు శుభవార్త

ఇరవై నాలుగు గంటలు, 365 రోజులు భక్తుల కోసం నిలబడి వారి బాధలను తీర్చే కల్పవృక్షస్వరూపి తిరుమల వేంకటేశ్వర స్వామి కృప అనంతము.
“శ్రీహరి భక్తులకు సేవ చేస్తే చాలు, శ్రీహరి అనుగ్రహిస్తారు” అని పురాణాలు స్పష్టంగా ఉపదేశిస్తున్నాయి.
ఈ పవిత్రమైన సేవా భావానికి ప్రతిరూపంగా, సాక్షాత్తు జగద్గురువులు శ్రీ శృంగేరి శ్రీ భారతి తీర్థ మహాస్వామివారి ఆశీస్సులతో తిరుమల శృంగేరి మఠం వారు బ్రాహ్మణులకు ప్రతి రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి “శ్రీ శారద అన్న ప్రసాదం” అనే పవిత్ర నామకరణం జరిగింది.
శుచిగా, శుభ్రంగా, బ్రాహ్మణుల చేత వండించి భక్తులకు వితరణ చేస్తున్న ఈ సేవ నిజంగా బ్రాహ్మణులకు ఒక గొప్ప శుభవార్త.
ఈ సృష్టిలో అత్యంత విశిష్టమైనది మానవ జన్మ.
ఈ జన్మకు సార్థకత చేకూర్చేది సేవా వితరణ.
తిరుమల చేరుకుని స్వామి దర్శనం కోసం ఆతురతతో ఎదురుచూస్తున్న భక్తుల ఆకలి తీర్చేందుకు, శృంగేరి మఠం వారు ప్రతిరోజూ అన్న ప్రసాదాన్ని అందించడం అనేది ఒక మహాయజ్ఞం.
ప్రతి రోజూ ఈ కార్యక్రమం తిరుమలలోని స్థానిక శృంగేరి మఠంలో జరుగుతుంది.
ఈ అద్భుత సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు:
శ్రీమాన్ డా. కె. చంద్రశేఖర్ గారు
ధర్మాధికారి, శృంగేరి మఠం, తిరుమల
ఈ పవిత్ర సేవలో మనందరం శక్తివంచన లేకుండా సహకరించాలి.
మీరు తిరుమలకు రానున్నట్లయితే, ముందుగా సమాచారం అందించేందుకు సంప్రదించవచ్చు:
ఫోన్ నంబర్లు:
0877 – 2277269
94402 71698
శ్రీ శారదాంబ సమేత వేంకటేశ్వర స్వామివారి కృప మీ అందరిపై ఉండాలి.
