ఇరవై నాలుగు గంటలు, 365 రోజులు ఆ దేవదేవుడు, తిరుమల వేంకటేశ్వర స్వామి మన కోసం నిలబడి మన బాధలు తీరుస్తూ కల్పవృక్షం గా తిరుమల లో వెలిశారు. *శ్రీహరి భక్తులకు సేవ చేస్తే చాలు శ్రీ హారి మనకు అనుగ్రహిస్తారు అని పురాణాలు చెప్తున్నాయి.

సాక్షాత్తు జగద్గురువులు శ్రీ శృంగేరి భారతి తీర్థ స్వామి అసిస్సుల తో మరియు వారి అనుగ్రహం తో తిరుమల శృంగేరి మఠం వారు మన బ్రాహ్మణులకు ప్రతి రోజు అన్న ప్రసాద వితరణ ను ప్రారంభించారు.
శ్రీ శారద అన్న ప్రసాదం అనే పేరు తో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
శుచిగా శుభ్రంగా బ్రాహ్మణుల చేత వండించి వితరణ చేస్తారు. ఇది బ్రాహ్మణులకు శుభవార్త.

ఈ సృష్టిలో విశిష్టమైనది మానవజన్మ.
ఈ జన్మకు సార్థకత చేకూర్చేది వితరణ.
ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమల చేరుకుని స్వామి దర్శనం కోసం ఆర్తి తో ఎదురుచూస్తున్న భక్తులకు, కాస్త ఆకలి తీర్చే కార్యక్రమం శృంగేరి మఠం వారు చేస్తున్న అన్న ప్రసాద వితరణ.
ప్రతి రోజూ ఈ కార్యక్రమం స్థానిక శృంగేరి మఠం నందు జరుగుతుంది . ఇది గొప్ప యజ్ఞం. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్న వారు శ్రీమాన్ కే చంద్ర శేఖర్ గారు ధర్మాదికారి, శృంగేరి మఠం. తిరుమల శృంగేరి మఠం వారికి మనం అందరం సహకరించాలి.

కాబట్టి ఈ సమాచారం అందరికీ అందించండి. వారి నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీ రాక ను ముందే వీరికి తెలియజేయగలరు . 0877 2277269, 9440271698.

మీ
Dr K Chandrasekhar Sastry
Dharmadhikari
Sri sringeri mutt, Tirumala