జీవనశైలి

మీ జీవితం మీద ఒకసారి వెనక్కి తిరిగి చూడండి…

blank

కథ బాగుంది… వెరైటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది… ఇది కదా పది మందికీ షేర్ చేయాల్సింది…


ఆయన వయస్సు సుమారు 50 ఏళ్లు…
నీరసంగా కనిపిస్తున్నాడు… ముసుగులో ఒక తడి బాధ. ఏదో తెలియని ఒత్తిడి, గుండెను గింగిరాలు కొడుతున్న విసుగు, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేని అసంతృప్తి… నిజానికి, ఈ వయస్సులో మనిషి జీవితం పట్ల లైట్‌గానే ఉండాలి —
ఆరోగ్యం కాపాడుకుంటూ, ఇష్టమైన పనులు చేస్తూ, మిగిలిన జీవితం నెమ్మదిగా, ఆనందంగా గడపాలి. డబ్బు వస్తుంది… పోతుంది… పదవులు వస్తాయి… పోతాయి… కానీ చివరికి మనకోసమే మిగిలే దాని పేరు – జ్ఞాపకాలు.

ఆయన భార్య ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకుంది.
కౌన్సిలింగ్ మొదలైంది…
డాక్టర్ మొదట కొన్ని ప్రాథమిక విషయాలు అడిగాడు. తర్వాత ఆమెను బయటకు పంపించి ప్రశ్నించాడు —

“ఇప్పుడు చెప్పండి… అసలేమైంది మీకు? ఎందుకీ దిగులు, ఎందుకీ డిప్రెషన్? శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు… మరి ఏం బాధ..?”

ఆయన నిశ్శబ్దంగా తల వంచి, నిదానంగా మాట్లాడసాగాడు…
“చాలా బాధగా ఉంది డాక్టర్… ఉద్యోగ ఒత్తిడి ఎక్కువైంది… పిల్లల చదువులు, వాళ్ల భవిష్యత్, పెళ్లిళ్లు, ఇంటి లోన్, కార్ లోన్… అన్నీ కలిసిపోయి నన్ను నలిపేస్తున్నాయ్. నిద్రపట్టడం లేదు…”

అయితే ఆ డాక్టర్ మాత్రం భిన్నంగా ఆలోచించేవాడు.
ఎప్పటికీ మందుల మీద బతికేలా చేయని మానసిక నిపుణుడు. మళ్లీ ఓ ప్రశ్న వేసాడు —

“మీ పదో తరగతి స్కూల్ పేరు గుర్తుందా..?”

ఆయన ఆలోచించి పేరు చెప్పాడు. డాక్టర్ చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు —
“మీరు ఆ స్కూల్‌కి వెళ్లండి. మీరు చదువుకున్న పదో తరగతి రిజిష్టర్ తీసుకోండి. మీ క్లాస్మేట్ల పేర్లన్నీ వ్రాసుకోండి… వాళ్ల గురించి సమాచారం సేకరించండి.
మీ మైండ్ డైవర్ట్ అవుతుంది. బహుశా మీరు మళ్లీ నా దగ్గరికి రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు…”

ఆయన నిజంగానే బడికి వెళ్లాడు.
పాత బీరువాలో దాచిన రిజిష్టర్ తీసి దుమ్ము దులిపాడు.
క్లర్క్ నవ్వుతూ అన్నాడు —
“సర్టిఫికెట్ కావాలంటే ఇప్పించేస్తాను సార్, మీకీ పేర్లేమిటి..?”

“అల్యూమినీ మీటింగ్ ప్లాన్ చేస్తున్నాను…” అని నవ్వుతూ చెప్పాడు.

రెండు సెక్షన్ల కలిపి మొత్తం 120 పేర్లు…
ఆయన ఇంటికి వెళ్లి నెలరోజుల పాటు కష్టపడ్డాడు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా ద్వారా వివరాలు సేకరించాడు… చివరకు 80 మందిపై సమాచారం దొరికింది.
కానీ…

20 మంది మృతి చెందినట్లు తెలిసింది…
7 మంది జీవిత భాగస్వాములను కోల్పోయారు…
13 మంది విడాకులు తీసుకున్నారు…
10 మంది వ్యసనాల పాలయ్యారు…
5 మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు…
2 మందికి కేన్సర్…
2 మంది పక్షవాతం…
ఒకడు జైలులో ఉన్నాడు…
ఒక జంట వెన్నెముక గాయంతో మంచం మీదే…

అంతా గమనించి, పాయింట్లుగా రాసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. వివరంగా వివరించాడు. చివరగా డాక్టర్ ఇలా అన్నాడు —

“ఇప్పుడు నువ్వే చెప్పు… నీ పరిస్థితి ఏంటి..?
నీకు రోగాల్లేవు… నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంది… నీకు పని ఉంది, బాధ్యతలు ఉన్నా సరే, నువ్వు వాటిని నెగ్గగలవు…
జరగబోయేది ఏదైనా సరే, అది మానలేం… ముందుగా ఆహ్వానించాల్సిందే… మరి రేపటి ఆందోళనతో ఈరోజును ఎందుకు పాడుచేసుకుంటావు..?
ఇప్పుడే వెళ్లండి… జీవించండి… నిస్సందేహంగా.”

డాక్టర్ ఓ చివరి మాట చెప్పాడు, తలచుకుంటే జీవితాంతం తీపిగా నిలిచిపోతుంది —

“ఇతరుల పళ్లేలలో ఏముందో చూడకండి…
మీ పళ్లెంలో ఉన్న ఆహారాన్ని ఆస్వాదించండి…
ఇతరులతో పోలిక వద్దు. ప్రతి జీవితం ఒక్కటే.”


ఇప్పుడు చెప్పండి…

మీకు కూడా మీ పాత బడికి వెళ్లి, పదో తరగతి రిజిష్టర్ తిరగేయాలనిపిస్తున్నదా…?

శుభం.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక