అద్భుతం – మనిషి జీవితం

మనిషి జీవితం నిజంగా ఒక అద్భుతం.
అంత గొప్ప, విలువైన జీవితాన్ని మనం తామే తాము అర్ధాంతరంగా ముగించుకుంటున్నామా?
అవును అనే సమాధానం చాలా సందర్భాల్లో నిజమే.
మనిషికి అత్యవసరమైన గాలి ఉచితంగా లభిస్తుంది.
కానీ పరిశ్రమలు పర్యావరణ ప్రమాణాలు పాటించక, అడవులు నరికివేయడం ద్వారా మనమే గాలిని కలుషితం చేస్తున్నాం.
నీరు కూడా ప్రకృతిచే దత్తమైన వరం.
అయితే పరిశ్రమల్లో వాడిన నీటిని శుద్ధి చేయకుండానే నదులలో వదలడం వలన, స్వచ్ఛమైన నదీజలాలు విషపూరితం అవుతున్నాయి.
ఆహార విషయంలోనూ మన తీరులో చిత్తశుద్ధి లేదు.
ఏది తినాలి, ఎంత తినాలి అన్న స్పష్టత లేకుండా – హద్దు లేకుండా, వేళాపాళా లేకుండా తినడం వల్ల మన ఆరోగ్యం నశిస్తోంది.
శరీరానికి ముప్పుగా మారే మత్తు పదార్థాలు – సిగరెట్లు, గుట్కాలు, మద్యపానాలు – ఇవన్నీ మన శరీరాన్ని క్రమంగా పాడుచేస్తున్నాయి.
“మందు తాగి… మాయ మందులు వేసుకుంటున్నాం.”
ప్రకృతిసిద్ధమైన ఆహారాన్ని వదిలి, తినేలా కాదు అనిపించే మాంసాహారాన్ని రకరకాల మసాలాలు వేసి వంటలుగా మార్చి తినేస్తున్నాం.
పిజ్జా, బర్గర్ లాంటి అహార సంస్కృతి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.
శుధ్ధమైన నీటిని పక్కన పెట్టి, విషపూరిత కూల్‌డ్రింక్స్ తాగడం నిత్యకృత్యంగా మారింది.
నిద్రపోవడం, లేవడం వంటి జీవనశైలిని కూడా గాలికొదిలేశాం.
రాత్రిళ్లు 12 నుంచి 2 గంటలవరకు నిద్రలేని జీవితాలు… ఫోన్లు, టీవీలు, ఆటలు, వీడియోలు మన శరీరాన్ని, మనసును నీరసం చేస్తున్నాయి.
జీవిత లక్ష్యాలను గాలికి వదిలేయడం అవసరమా?
ఇది మనం అంతా ఆలోచించాల్సిన విషయమే.
– బి. మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సెలింగ్ సైకాలజిస్ట్