జాగ్రత్త – అతి జాగ్రత్త: విజయం సాధించేందుకు సత్పథం

జీవితంలో జాగ్రత్తగా ఉంటే ఉన్నత స్థితికి చేరుకోవడమే కాదు,
సుఖాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది,
కష్టాలు తక్కువగా ఎదురయ్యే అవకాశముంటుంది.
కొంతమంది కేవలం మనసు పెట్టి పనిచేస్తారు,
కానీ మెదడు ఉపయోగించకుండా ఆలోచనలేక ముందుకు వెళతారు.
దీనివల్ల వారు కష్టాల్లో పడతారు.
అది మంచిపద్ధతి కాదు.
ఏ ముఖ్యమైన పని తలపెట్టే ముందు
రెండు మూడు సార్లు మెదడుతో ఆలోచించాలి.
ఆ తరువాత నిర్ణయం తీసుకుంటే నష్టపోవడం తక్కువగా ఉంటుంది.
అనుకున్నది సాధించగలుగుతారు.
సమాజంలో మంచిపేరు సంపాదించడంతో పాటు
సమర్థుడిగా గుర్తింపు పొందుతారు.
అతి జాగ్రత్త వలన ప్రతీ విషయాన్ని అతిగా ఆలోచిస్తూ
ఏదో తప్పు జరిగిపోతుందేమో అని ముందే ఊహించి
ఏ పని చెయ్యరు, లేదా టైమ్ గడచిన తర్వాత
పనికి పూనుకుంటారు.
ఉదాహరణకు నేటి కాలంలో పిల్లల వివాహం విషయంలో
అతి జాగ్రత్తతో ఆలోచిస్తూ సకాలంలో వివాహం చేయకుండా ఆలస్యం చేస్తున్నారు
లేదా వివాహానికి దూరం చేస్తున్నారు.
దీనిని చేతులు కాలక ఆకులు పట్టుకోవడం అంటారు.
ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.
ఇలాంటివల్ల జీవితంలో నష్టపోవడం, ఇంకోరికీ నష్టం కలిగించడం తప్ప ఏ ఉపయోగం ఉండదు.
మంచి ముత్యాలు – 9133320425