వాన, పిల్లలు, ఫోన్లు – కోల్పోతున్న బాల్యం

వచ్చింది వర్షంతెచ్చింది హర్షంవచ్చాయి సెలవులుమెచ్చారు పిల్లలు టచ్‌ఫోన్లు పట్టుకునివదలనే వదలరుకాగితం పడవలు చేసినేస్తాల వెంట నిల్చొనినీటి ప్రవాహంలో విడిచే నాటిఆటల అలవాట్లువదిలేసినారాయే ప్రకృతి అందాలుచూడనే చూడరుఫోన్లోనే అన్నీ చూస్తారు “వానా వానా వల్లప్పచేతులు చాచు చెల్లప్ప”అని పాడుతూ ఆడేఆ ఆటలునేడు కనుమరుగైపోయాయి ఏఐ యుగంలోఎటుపోవునో గానిపాతకాలం ఆటలకూ పాటలకూచెల్లుచీటి నేడు ఇచ్చేస్తున్నారు అమ్మానాన్నలూపట్టనట్లున్నారుచెరో ఫోన్ పట్టుకునికాల్స్ చేస్తూముచ్చట్లాడుతూపిల్లల పెంపకాన్నిపట్టించుకోవడం లేదు ఇలా సాగితేఎలా అవుతారు నేటి బాలలు?
వచ్చింది వర్షం
తెచ్చింది హర్షం
వచ్చాయి సెలవులు
మెచ్చారు పిల్లలు
టచ్‌ఫోన్లు పట్టుకుని
వదలనే వదలరు
కాగితం పడవలు చేసి
నేస్తాల వెంట నిల్చొని
నీటి ప్రవాహంలో విడిచే నాటి
ఆటల అలవాట్లు
వదిలేసినారాయే
ప్రకృతి అందాలు
చూడనే చూడరు
ఫోన్‌లోనే అన్నీ చూస్తారు
“వానా వానా వల్లప్ప
చేతులు చాచు చెల్లప్ప”
అని పాడుతూ ఆడే
ఆ ఆటలు
నేడు కనుమరుగైపోయాయి
ఏఐ యుగంలో
ఎటుపోవునో గాని
పాతకాలం ఆటలకూ పాటలకూ
చెల్లుచీటి నేడు ఇచ్చేస్తున్నారు
అమ్మానాన్నలూ
పట్టనట్లున్నారు
చెరో ఫోన్ పట్టుకుని
కాల్స్ చేస్తూ
ముచ్చట్లాడుతూ
పిల్లల పెంపకాన్ని
పట్టించుకోవడం లేదు
ఇలా సాగితే
ఎలా అవుతారు నేటి బాలలు?
ఉత్తమ పౌరులు కాదు
యాంత్రిక బొమ్మలవుతారు
———————————
చాకలకొండ శారద
విశ్రాంత ప్రధానోపాధ్యాయిని
కావలి, నెల్లూరు జిల్లా
9440757799




