వివాహబంధం – ఆలుమగల మధ్య అనుబంధం, అర్థం & సౌభాగ్యం

అలుమగలంటే కేవలం వివాహబంధం ద్వారా ఒక్కటయ్యే జంటలనే కాదు, భార్యాభర్తలు, మొగుడు–పెళ్లాలు అని కూడా అంటారు. తనువులు వేరైనా, ఆలోచనలు వేరైనా, చివరికి ఇద్దరూ కలసి ఒకే రకమైన ఆలోచనను ఆచరణయోగ్యంగా మారుస్తారు.
కొబ్బరికాయలో నీటిని చూడాలంటే, దానిని రెండు–మూడు సార్లు గట్టిగా కొడితే గానీ కనిపించదు. కానీ ఆ నీటిని సేవిస్తే, అది మధురంగా అనిపిస్తుంది. అలాగే, ఆలుమగల మధ్య చిన్నచిన్న గొడవలు సహజం. కానీ వాటి ఫలితాన్ని కొబ్బరి నీటి మాధుర్యంలా భావించి, ఇద్దరూ కలసి ఆ అనుభూతిని ఆస్వాదించాలి.
వివాహబంధం కేవలం ఆలుమగలకు మాత్రమే పరిమితమైంది కాదు. ఈ బంధం వల్ల రెండు కుటుంబాల మధ్య బంధం ఏర్పడటమే కాకుండా, మరికొన్ని కుటుంబాలతోనూ అనుబంధాలు ఏర్పడతాయి. అందుకే మన హిందూ సంప్రదాయంలో వివాహానికి అగ్రతాంబూల ప్రాముఖ్యత ఉంది.
వివాహబంధం చిగురించే మొక్కలా ఉంటుంది. ఇది అచిరకాలంలోనే “పిల్లలు” అనే కొమ్మలను ఏర్పరిచి, వాటిని అభివృద్ధి చేస్తూ, తాను ఒక వృక్షంలా మారుతుంది.
కొంతమందికి వివాహ బంధంలో అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు రావచ్చు. కానీ వాటిని ఆదిలోనే తెలివిగా పరిష్కరించుకుంటే, ఈ బంధం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వివాహ వ్యవస్థ బలపడితే, దేశ సౌభాగ్యానికి కూడా తోడ్పడుతుంది.
సమస్య ఎక్కడైనా ఉంటుంది. కానీ వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటే, అవి మధురఫలాలను ఇస్తాయి.
– బి. మల్లికార్జున దీక్షిత్
(దీక్షిత్ ఫామిలీ కౌన్సిలర్ & కౌన్సెలింగ్ సైకాలజిస్ట్)
📞 91333 20425
tlovertonet
April 2, 2025Your comment is awaiting moderation.
Hi, I think your site might be having browser compatibility issues. When I look at your website in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, fantastic blog!