అదిదంపతులు పార్వతిపరమేశ్వరుల అనుగ్రహంతో
మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో,
సుఖసంతోషాలతో నిండిన నూరేళ్ళు ఆనందంగా జీవించాలని
కోరుకుంటూ...

ఈ రోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న
ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

Advertisement


📅 సోమవారం – 06-10-2025

🕊️ ఈ రోజు AVB మంచి మాటలు 🕊️

  • అందని దానికోసం ఆశ పడొద్దు.
  • నచ్చని దాని కోసం కష్టపడొద్దు.
  • మనల్ని ఇష్టపడేవారిని నష్టపెట్టొద్దు.
  • మనకై కష్టపడేవారికి ద్రోహం చెయ్యొద్దు.

Advertisement

మనం ఏమి చేసినా సమర్థించే వాళ్ళు వెనుక
గోతులు తీసే స్వార్థపరులు అవుతారు.
నీవు తప్పు చేసినప్పుడు “తప్పు” అని చెప్పేవాళ్లే
నీ నిజమైన ఆత్మీయులు.
మంచిని, చెడుని రెండింటినీ తెలియజేసే వాళ్ళు
నిజమైన స్నేహితులు.


ఒకరి గురించి వేరొకరి దగ్గర మాట్లాడితే
దూరాలు పెరుగుతాయి.
ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే
దూరాలు తగ్గుతాయి.

Advertisement

నేడు మంచిని విమర్శించేవారు మన అడుగడుగునా ఉంటారు,
వెనక్కి లాగే వారు మన వెన్నంటే ఉంటారు.
నీ మేలు కోరేవారు ఎక్కడో ఒక్కరు మాత్రమే ఉంటారు.
అలాంటి స్నేహన్ని నీ మాటలతో, నీ చేతులతో
ఎప్పటికీ దూరం చేసుకోకు.


మనం ఏర్పాటు చేసుకున్న సంబంధాలు
ఎప్పుడూ మామూలుగా చేడిపోవు.
ఎవరో ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన,
అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే అవి చేడిపోతాయి.

ఒకరితో స్నేహం చెయ్యడానికి కారణాలు ఉండవు,
కానీ శత్రుత్వానికి మాత్రం కారణాలు తప్పనిసరిగా ఉంటాయి.


Advertisement

మీరు చేసే మంచి పని ఏదైనా
దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు
మిమ్మల్ని తప్పకుండా చేరుతుంది.

మంచి పనులే చేద్దాం – మంచి గానే జీవిద్దాం.


✍️ మీ AVB సుబ్బారావు
📞 9985255805