ఒకప్పుడు 12 గంటలు పట్టే ప్రయాణంఇప్పుడు 4 గంటలకే పూర్తవుతుంది,అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

ఒకప్పుడు 12 మంది ఉన్న కుటుంబం
ఇప్పుడు 2 మందికే పరిమితమైంది,
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

ఒక సందేశం చేరడానికి ఒకప్పుడు 2 వారాలు పట్టేది,
ఇప్పుడు 2 సెకన్లలో చేరుతుంది,
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

దూరంగా ఉన్నవారి ముఖం చూడడానికి
ఒకప్పుడు సంవత్సరాలు పట్టేవి,
ఇప్పుడు సెకన్లలో కనిపిస్తోంది,
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు.

ఇంట్లో తిరగడానికి ఒకప్పుడు ఎంతో శ్రమ పడేది,
ఇప్పుడు లిఫ్ట్‌లో క్షణాల్లో పూర్తవుతోంది,
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

బ్యాంక్ క్యూలో గంటల తరబడి నిలబడ్డ మనిషి,
ఇప్పుడు మొబైల్‌లో సెకన్లలో లావాదేవీలు చేస్తాడు,
అయినా అంటున్నాడు –
సమయం లేదు

ఒకప్పుడు వైద్య పరీక్షల రిపోర్టులు రావడానికి వారాలు పట్టేవి,
ఇప్పుడు కొన్ని గంటల్లోనే వస్తున్నాయి,
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

బైక్ పై వెళ్తూ ఒక చేయి హ్యాండిల్‌పై, ఇంకో చేయి ఫోన్‌పై –ఆగి మాట్లాడే సమయం లేదంటూ – సమయం లేదు

కారు నడుపుతూ ఒక చేయి స్టీరింగ్‌పై, ఇంకో చేయి వాట్సాప్‌పై ఎందుకంటే అతనికి సమయం లేదు.

ట్రాఫిక్‌లో తానే కొత్త లేన్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతాడు –
ఎందుకంటే అతనికి సమయం లేదు.

స్నేహితుల మధ్య, జనాల్లో ఉన్నా
వేళ్లు మాత్రం ఫోన్‌లోనే బిజీ –ఎక్కడికో చేరాల్సి ఉందట సమయం లేదు

ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు,కానీ మనుషుల మధ్య ఉంటే అసహనంగా మారతాడు –
ఎందుకంటే అతనికి సమయం లేదు.

అతనికి సమయం లేనివి

  • పుస్తకాలు చదవడానికి సమయం లేదు
  • •యెగా చేయడానికి సమయం లేదు
  • తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు
  • స్నేహితులను కలవడానికి సమయం లేదు
  • ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు
  • కుటుంబంతో ఉండడానికి సమయం లేదు
  • భోజనం చేయడానికి సమయం లేదు
  • నిద్రపోవడానికి సమయం లేదు
  • కానీ
    వీటికి మాత్రం సమయం ఉంది…
    IPL, Netflix, వాట్సప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, మరియు ఇతర సోషల్ మీడియా లోని,అర్థంలేని రీల్స్
    అనవసర రాజకీయ వాదనలకు.. సమయం పుష్కలంగా దొరుకుతుంది..

Advertisement

వాస్తవం
ప్రపంచం సులభమైంది,
సాంకేతికత దగ్గరైంది,
దూరాలు మాయమయ్యాయి,
సౌకర్యాలు పెరిగాయి,
అవకాశాలు విస్తరించాయి…
అయినా మనిషి కి
సమయం లేదు అని చెబుతూనే
తన నుంచి తానే దూరం అవుతున్నాడు..

చివరి సత్యం
ఒక రోజు సమయమే అతని చేతుల నుంచి జారిపోతుంది.ఆ చివరి క్షణంలో అతనికి అర్థమవుతుంది:
సమయం ఉంది…
కానీ అప్పటికె జీవితం మొత్తం అయిపోయి చివరి క్షణాల్లో ఉంటాడు అప్పుడు ఎంత సమయం ఉన్నా వృధా..

దయచేసి బంధాలకు, బంధుత్వాలకు, స్నేహితులకు, సేవా కార్యక్రమాలకు, సమయాలు కేటాయిస్తూ ఉన్నన్ని రోజులు *పేరు ప్రఖ్యాతలు గడిస్తూ సుఖంగా సంతోషంగా ఉన్నన్ని రోజులు జీవించండి…

తరచుగా అడిగే ప్రశ్నలు

సౌకర్యాలు పెరిగినా మనిషి 'సమయం లేదు' అని ఎందుకు అంటున్నాడు?

ఒకప్పుడు 12 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు 4 గంటలకే పూర్తవుతుంది, 2 వారాలు పట్టే సందేశం 2 సెకన్లలో చేరుతుంది. అయినా ఆదా అయిన సమయం ఫోన్, సోషల్ మీడియాకే పోతుండటంతో మనిషి సమయం లేదు అంటున్నాడు.

సమయం లేదనే పేరుతో మనం దేనిని నిర్లక్ష్యం చేస్తున్నాం?

పుస్తకాలు చదవడం, యోగా, తల్లిదండ్రులకు ఫోన్ చేయడం, స్నేహితులను కలవడం, ప్రకృతిని ఆస్వాదించడం, కుటుంబంతో ఉండడం, భోజనం, నిద్ర వంటి వాటికి సమయం కేటాయించడం లేదు.

మరి మన సమయం ఎక్కడికి పోతోంది?

IPL, Netflix, వాట్సప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలోని అర్థంలేని రీల్స్‌కు, అనవసర రాజకీయ వాదనలకు సమయం పుష్కలంగా దొరుకుతోంది.

సాంకేతికత దగ్గరైనా సంబంధాలు ఎందుకు దూరమవుతున్నాయి?

ప్రపంచం సులభమైంది, దూరాలు మాయమయ్యాయి, సౌకర్యాలు పెరిగాయి. అయినా స్నేహితుల మధ్య ఉన్నా వేళ్లు ఫోన్‌లోనే బిజీగా ఉండటంతో మనిషి తన నుంచి తానే దూరం అవుతున్నాడు.

సంబంధాలను కాపాడుకోవడానికి ఏం చేయాలి?

బంధాలకు, బంధుత్వాలకు, స్నేహితులకు, సేవా కార్యక్రమాలకు సమయం కేటాయిస్తూ సుఖంగా సంతోషంగా జీవించాలి. చివరి క్షణాల్లో సమయం ఉన్నా అప్పటికే జీవితం అయిపోయి ఉంటుంది.