ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి వారి కరుణాకటాక్షాలతో,
మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో నిండిన నూరేళ్ళు ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను.

ఈ రోజు జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయులకు హృదయపూర్వక శుభాభినందనలు. 💐🌹🍇🥭🍫

Advertisement

📅 31-08-2025 (ఆదివారం)


🌿 ఈ రోజు AVB మంచి మాటలు 🌿

Advertisement

  • మనం కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన మిత్రులు, మన సుఖాల్లో కూడా ప్రధాన భాగస్వాములు అవుతారు.
    కానీ నేటి సమాజంలో కష్టాల్లో తోడుగా నిలిచిన వారినే వెన్నుపోటు పొడవటం సాధారణమైపోయింది.
  • మిత్రమా!
    👉 “మోస్తున్నాడు కదా” అని మోయలేని బరువు వేయడం తప్పు.
    👉 “తగ్గుతున్నాడు కదా” అని తక్కువ చేసి చూడటం కూడా తప్పే.
  • మనసులో విషం పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడేవారు చాలామందే ఉంటారు.
    అలాంటి వారికి మౌనమే గొప్ప సమాధానం.
  • టైం బాగోలేనప్పుడు సింహం కూడా సర్కస్‌లో గంతులు వేయాల్సి వస్తుంది.
    అలాగే మనకూ తాత్కాలికంగా అడ్డమైన వారితో మాటపడాల్సి వస్తుంది.
    అది మన తగ్గుదల కాదు, నెగ్గే రోజు ఇంకా రాలేదనే విషయం మాత్రమే.
  • గతాన్ని తలుచుకుంటే అందులో ఆనందకరమైన రోజులు ఉన్నట్టే బాధాకరమైన రోజులు కూడా ఉంటాయి.
    అందుకే అంటారు — “మంచి-చెడుల కలయికే జీవితం.”
  • ఓడిపోయినప్పుడు భుజం తట్టిన చెయ్యి, గెలిచినప్పుడు హృదయం హత్తుకునే అర్హత పొందుతుంది.
  • మనల్ని చూసి కుక్కలు మోరిగినంత మాత్రాన మనం దొంగలమైపోము.
    మన నిజమైన విలువ తెలిసిన రోజు, అవే మన ముందర తొకూపుకుని నిలుస్తాయి.
  • మనిషి జీవితం రైలు ప్రయాణంలాంటిది.
    ధనవంతుడు AC రిజర్వేషన్‌లో, మధ్యతరగతి వాడు రిజర్వేషన్‌లో, పేదవాడు జనరల్ భోగిలో వెళతాడు.
    కానీ చివరికి దిగే గమ్యం ఒక్కటే – ఆ స్థాయిలన్నీ అక్కడే ముగుస్తాయి.


✨ ఈ ఆదివారం మీకు శుభం, శాంతి, సంతోషం కలగాలని ఆశిస్తున్నాను ✨