మనిషికి — ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు?

1️⃣ రూపం – రంగు మనిషి రూపం, రంగు చూసి మాత్రం “విలువ” ఇవ్వరు.
1️⃣ రూపం – రంగు
మనిషి రూపం, రంగు చూసి మాత్రం “విలువ” ఇవ్వరు.
అంతే గానీ, “బాగున్నారు” అన్న ప్రశంస మాత్రమే దక్కుతుంది!
2️⃣ శారీరక బలం – ఆర్థిక బలం
అంగబలం ఉన్నా, ఆర్థిక బలం ఉన్నా కూడా
వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని
కొంతమంది “అణుకువ” నటిస్తారు…
అంతవరకే!
3️⃣ పదవి – పలుకుబడి
పదవి, పలుకుబడి ఉన్నప్పుడు చుట్టూ తిరుగుతారు.
కానీ అది “విలువ” కోసం కాదు, వాడుక కోసం!
పదవి పోయిన పూటకే వెనుతిరిగి చూస్తే —
ఒక్కడూ ఉండడు!
ఇది నిజం.
4️⃣ మాట – వినోదం
కొంతమంది కబుర్లు చెప్పి, కాసేపు నవ్వించి
“కడుపు నింపినంత గొప్పగా” అనిపిస్తారు.
కాని ఆ ఆనందం క్షణికం మాత్రమే —
“విలువ” మాత్రం ఇవ్వరు!
👉 అయితే మనిషి విలువ పొందాలంటే…
మనిషిలో ఉండవలసినవి ఇవి👇
- కరుణ
- దయ
- ప్రేమ
- జాలి
- సేవాభావం
- సాయపడాలనే తపన
- మంచి మనసు
- తెగింపు
- విశాల హృదయం
ఈ లక్షణాలు మనలో ఉంటే —
“విలువ” మనం పిలవకుండానే,
మన దగ్గరికి వస్తుంది! 🌿
శుభోదయం 🙏
— వాసు ముక్తినూతలపాటి
తరచుగా అడిగే ప్రశ్నలు
మనిషి రూపం, రంగు చూసి విలువ ఇస్తారా?
లేదు. రూపం, రంగు చూసి "బాగున్నారు" అన్న ప్రశంస మాత్రమే దక్కుతుంది, అసలైన విలువ మాత్రం రాదు.
పదవి, పలుకుబడి ఉన్నవారికి వచ్చే గౌరవం నిజమైన విలువా?
కాదు. పదవి, పలుకుబడి ఉన్నప్పుడు చుట్టూ తిరిగేవారు విలువ కోసం కాదు, వాడుక కోసం తిరుగుతారు; పదవి పోయిన పూటకే ఒక్కరూ మిగలరు.
శారీరక బలం లేదా డబ్బు ఉంటే మనిషికి విలువ వస్తుందా?
అంగబలం, ఆర్థిక బలం ఉన్నవారి ముందు కొందరు ఎప్పుడైనా అవసరం పడుతుందేమో అని అణుకువ నటిస్తారు, అంతవరకే. అది నిజమైన విలువ కాదు.
కబుర్లు చెప్పి నవ్వించేవారికి విలువ దక్కుతుందా?
కబుర్లు, వినోదం ఇచ్చే ఆనందం క్షణికం మాత్రమే. దానివల్ల కాసేపు బాగా అనిపించినా, విలువ మాత్రం ఇవ్వరు.
మనిషి విలువ పొందాలంటే ఏ లక్షణాలు ఉండాలి?
కరుణ, దయ, ప్రేమ, జాలి, సేవాభావం, సాయపడాలనే తపన, మంచి మనసు, తెగింపు, విశాల హృదయం ఉండాలి. ఈ లక్షణాలు ఉంటే విలువ మనం పిలవకుండానే మన దగ్గరికి వస్తుంది.




