అనంతపురం వాసి వేదవతి సహా ఆరుగురి ప్రాణాలు తీసిన ఉత్తరకాశి హెలికాప్టర్ ప్రమాదం

ఉత్తరాఖండ్, ఉత్తరకాశి: పుణ్యక్షేత్ర గంగోత్రికి వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ ఉత్తరకాశి జిల్లాలో ఘోరంగా కుప్పకూలింది. గంగానాని సమీపంలోని అడవిలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు పర్యాటకులు అక్కడికక్కడే మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ హెలికాప్టర్ డెహ్రాడూన్ నుండి హర్సిల్ హెలిప్యాడ్ వైపు ప్రయాణిస్తుండగా ఆపదకు గురైంది. ప్రమాదంలో మృతి చెందినవారిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ సోదరి వేదవతి కుమారి (48) కూడా ఉన్నారు. ఆమె భర్త భాస్కర్ (51) ఈ ప్రమాదంలో గాయపడగా, ప్రస్తుతం ఆయన్ని ఎయిమ్స్ రుషికేశ్‌కు తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ రుషికేశ్‌కు బయలుదేరారు.
మృతుల వివరాలు:
- కాలా సోని (61) – ముంబై
- విజయ రెడ్డి (57) – ముంబై
- రుచి అగర్వాల్ (56) – ముంబై
- రాధా అగర్వాల్ (79) – ఉత్తరప్రదేశ్
- వేదవతి కుమారి (48) – ఆంధ్రప్రదేశ్
- రాబిన్ సింగ్ (60) – గుజరాత్ (హెలికాప్టర్ పైలట్)