వంటకాలు
తెలుగువాణ్ణి తిండిలో కొట్టగలరా? — 250+ తెలుగు వంటకాల జాబితా
తెలుగు వారి వంటగదిలోని 250+ వంటకాలు — దోశలు, ఇడ్లీ, ఉప్మా, పులిహోర, చట్నీలు, పప్పులు, పచ్చళ్ళు, బజ్జీలు, ఊరగాయలు, పిండివంటలు & స్వీట్ల సంపూర్ణ జాబితా.

తెలుగు వారి వంటగదిలోని 250+ వంటకాలు — దోశలు, ఇడ్లీ, ఉప్మా, పులిహోర, చట్నీలు, పప్పులు, పచ్చళ్ళు, బజ్జీలు, ఊరగాయలు, పిండివంటలు & స్వీట్ల సంపూర్ణ జాబితా.
తెలుగువాణ్ణి తిండిలో కొట్టగలరా? ఇంత విస్తారమైన వంటకాల జాబితా బహుశా ప్రపంచంలో మరే వంటకంలోనూ ఉండదు! తెలుగు వారి వంటగదిలోని టిఫిన్లు, అన్నం రకాలు, చట్నీలు, పొడులు, పప్పులు, పచ్చళ్ళు, పులుసులు, బజ్జీలు, పకోడీలు, ఊరగాయలు, పిండివంటలు — ఇదిగో 250+ వంటకాల సంపూర్ణ జాబితా.
దోశలు & అట్లు
- మినపట్టు, పెసరట్టు, రవ్వట్టు, పేపర్ దోసె, మసాల దోసె, ఉల్లి దోసె, రాగి దోశ, చీజ్ పాలక దోశ
- కొబ్బరి అట్టు, గోధుమ అట్టు, అటుకుల అట్టు, సగ్గుబియ్యం అట్టు, బియ్యపు పిండి అట్లు, పుల్లట్టు, ఊతప్పం, పులి బొంగరం, ఉప్మా అట్టు
ఇడ్లీ & ఆవిరి వంటకాలు
- ఇడ్లీ, మసాల ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, సాంబార్ ఇడ్లి, ఇడ్లీ ఉప్మా, ఆవిరి కుడుము
ఉప్మా రకాలు
- మసాలా ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, సేమ్యా ఉప్మా, టమోటా బాత్
- బియ్యపు రవ్వ ఉప్మా, నూకలుప్మా, మరమరాల ఉప్మా, కొబ్బరి ఉప్మా, అటుకుల ఉప్మా, ఉప్పిడి పిండి
పొంగలి & టిఫిన్లు
- పప్పు పొంగలి, చక్రపొంగలి, కట్టుపొంగలి, పులగం
- పూరి, చపాతి, వడ, సాంబారు వడ
అన్నం రకాలు
- కంచి పులిహోర, నిమ్మ పులిహోర, కొబ్బరి అన్నం, పుదీనా పులావ్, బిర్యాని, దధ్యోదనం
- వెజ్ ఫ్రైడ్ రైస్, జీరా రైస్
చట్నీలు
- ఉల్లిపాయ చట్నీ, ఎండుమిరపకాయ చట్నీ, కొబ్బరి చట్నీ, మినప చట్నీ, వేరుశనగపప్పు చట్నీ
- శనగపప్పు చట్నీ, శనగపిండి చట్నీ (బొంబాయి చట్నీ), మునగాకు చట్నీ, గుమ్మడి చట్నీ
పొడులు
- శనగపప్పు పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, వెల్లుల్లి కారప్పొడి, కరివేపాకు పొడి, కందిపొడి
పులిహారలు
- అటుకుల పులిహార, చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార, మామిడికాయ పులిహార, రవ్వ పులిహార, సేమ్యా పులిహార
రోటీలు & పరోటాలు
- ఆలు పరోట, పరోట, పుల్కా, రుమాల్ రోటీ, కాలీఫ్లవర్ పరోటాలు
- పూరి & సాగు, పాలక్ పన్నీర్, కొత్తరకం పూరీలు
పప్పులు
- ముద్దపప్పు, దోసకాయ పప్పు, బీరకాయ పప్పు, టమోటా పప్పు, మామిడికాయ పప్పు, తోటకూర పప్పు, గుమ్మడి పప్పు, చింత చిగురు పప్పు
పచ్చళ్ళు (తాజా)
- కంది పచ్చడి, కొబ్బరి పచ్చడి, క్యాబేజి పచ్చడి, క్యారెట్ పచ్చడి, దొండకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి
- బీరకాయ తొక్కు పచ్చడి, బెండకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, వంకాయ పచ్చడి, వెలక్కాయ పచ్చడి, టమోటా పచ్చడి, మెంతికూర పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి
పులుసులు & సాంబారు
- సాంబారు, సాంబారు పొడి, తీపి పులుసు, పొట్లకాయ పులుసు, సొరకాయ పులుసు, మజ్జిగ పులుసు, పప్పు పులుసు
బజ్జీలు
- అప్పడం బజ్జి, అరిటికాయ బజ్జి, ఉల్లిపాయ బజ్జి, టమటా బజ్జి, బంగాళదుంప బజ్జి, బీరకాయ బజ్జి, బ్రెడ్ బజ్జి
- మిరపకాయ బజ్జి, వంకాయ బజ్జి, క్యాప్సికమ్ బజ్జి, కొర్ర బజ్జీ, గుమ్మడికాయ బజ్జీలు, దోసకాయ బజ్జి
పకోడీలు
- ఉల్లిపాయ పకోడి, క్యాబేజి పకోడి, గోధుమ పిండి పకోడి, పాలకూర పకోడి, బియ్యపు పిండి పకోడి, మసాల పకోడి
- మెత్తటి పకోడి, బ్రెడ్ పకోడి, పల్లీ పకోడీలు, సేమ్యా పకోడి, కాలీఫ్లవర్ పకోడి, ఆలూ పకోడి, ఖాండ్వీ, అటుకుల పోణీ
వడలు, పునుగులు & బోండాలు
- గుంట పునుగులు, పునుగులు, మైసూర్ బోండ, సగ్గుబియ్యం పునుగులు (సాగో బోండా), బఠాణీ బోండా, పచ్చి బఠానీ బోండాలు
- మసాల గారె, నేతి గారె, పప్పు వడ, మసాల వడ, వెజిటబుల్ వడ, పెసర గారెలు, మినపచెక్క వడలు
ఊరగాయలు
- మామిడికాయ ఆవకాయ, మామిడికాయ మాగాయ, మామిడికాయ తురుం పచ్చడి, ముక్కల పచ్చడి, పెసర ఆవకాయ, మునక్కాయ ఆవకాయ, ఉసిరి ఆవకాయ
- గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడి, దబ్బకాయ ఊరగాయ, పండు మిరపకాయల పచ్చడి
- నిమ్మకాయ ఊరగాయ, వెల్లుల్లి పచ్చడి, క్యాబేజీ ఊరగాయ, కాలీఫ్లవర్ పచ్చడి, చిలగడదుంపల పచ్చడి, ఉసిరికాయ పచ్చడి
చిప్స్, చెక్కలు & కారప్పూసలు
- కారప్పూస, చెగోడి, చెక్కలు, తపాళ చెక్కలు, పెసర చెక్కలు, చెక్క పకోడి, కారం చెక్కలు, కొబ్బరి చెక్కలు
- చక్రాలు, పెరుగు చక్రాలు, సగ్గుబియ్యం చక్రాలు, శనగపప్పు చక్రాలు, ఆలూతో చక్రాలు, జంతికలు, జొన్న మురుకులు, గవ్వలు, వాంపూస
- ఆలూ చిప్స్, బనానా చిప్స్, చిలకడ దుంప చిప్స్, కాకరకాయ చిప్స్, గుమ్మడి వరుగు, మైదా చిప్స్, మసాల బీన్స్, బూంది, వెన్న ఉండలు, పన్నీర్ చట్ పట్, సమోస, సోయా సమోస
పిండివంటలు & స్వీట్లు
- అరిసెలు, బూరెలు, కొబ్బరి బూరెలు, పచ్చి బూరెలు, తైదు బూరెలు, పాల బూరెలు, సజ్జ బూరెలు, గోధుమ బూరెలు, జొన్న బూరెలు
- చలిమిడి, కొబ్బరి పూర్ణాలు, గోధుమ పిండి పూర్ణాలు, పూతరేకులు, కజ్జికాయలు, కోవా కజ్జికాయ, తీపి గవ్వలు
- బూంది లడ్డు, రవ్వ లడ్డు, తొక్కుడు లడ్డు, నువ్వుల లడ్డు (చిమ్మిరి), మినప ముద్దలు, సున్నుండలు, వేరుశనగపప్పు ముద్దలు, మరమరాల ముద్దలు
- బాదుషా, మడత కాజా, తీపి కాజాలు, మైసూర్ పాకు, మిల్క్ మైసూర్ పాక్, జాంగ్రి, పూస మిఠాయి, కోవా, బూంది మిఠాయి
- జీడిపప్పు పాకం, శనగపప్పు పాకం, బాదంపాకము, కాజు క్యారెట్, బటర్ బర్ఫీ, కిస్‌మిస్ కలాకండ్, డ్రైఫ్రూట్స్ హల్వా, బాంబే హల్వా
- ఖర్జూరం స్వీట్, కొబ్బరి ఖర్జూరం, సేమ్యాతో అరిసెలు, చాంద్ బిస్కట్స్, పాపిడి, కాజాలు
ఇంకా ఏమైనా మిస్సయిన వంటకాల పేర్లు ఉంటే చెప్పండి — జాబితాకు యాడ్ చేద్దాం! 🙏💐




