(శివుని 108 నామములతో కూడిన పవిత్ర స్తోత్రం)


🔹 పరిచయం

Advertisement

ఈశ్వరునికి పేర్లు ఒకరు పెట్టినవేమీ కావు — అవి గౌణ నామములు.
భక్తుల పరిపాలనకై, గుణములను ప్రదర్శించుటకై, నిర్గుణుడైన శివుడు ఒక్కో సందర్భములో ఒక్కో గుణమును ఆవిష్కరిస్తాడు.
ఆ గుణప్రకటనము వలన లోకానికి, భక్తజన సమూహానికి అపారమైన ప్రయోజనం కలుగుతుంది.

శివాష్టోత్తర శతనామ స్తోత్రము వినడం ద్వారా

  • 108 నామములు ఎందుకు ఉన్నాయో,
  • ఆ నామముల ద్వారా శివతత్త్వం ఎలా వ్యక్తమవుతుందో,
  • దానివల్ల మనసు భగవత్ చింతనలో ఎలా నిలదొక్కుకుంటుందో అర్థమవుతుంది.

Advertisement

ప్రతీ నామం వెనుక ఒక తాత్పర్యం, ఒక తత్వం ఉంటుంది.
ఒక నామం మనసులో నిలబడినపుడు, ఆ నామ తత్వం మనసులో ప్రకాశిస్తుంది.
దానివల్ల భగవత్ తత్త్వమునందు గురి నిలబడుతుంది, భక్తికి స్థిరత వస్తుంది.
ఇదే స్తోత్రపఠనపు పరమార్థం.


🔹 శివాష్టోత్తర శతనామ పూజ స్తోత్రమ్

ఏ అభివృద్ధి, కోరిక అయినా —
ధర్మబద్ధమైనదై, త్వరగా తీరాలని అనుకుంటే —
ఒకసారి శివాష్టోత్తర శతనామ స్తోత్రము చదివి బయలుదేరండి అని పెద్దలు ఉపదేశిస్తారు.

Advertisement

🕉️ ధ్యానశ్లోకము

ధ్యానం

ధవళ వపుష మిందోర్మండలేసన్నివిష్ఠం
భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం ।
మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం
హృదయకమలమధ్యే సంతతం చింతయామి ॥

🙏 శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్

Advertisement

శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః ।
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ॥ ౧ ॥

శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః ।
శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః ॥ ౨ ॥

భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివప్రియః ।
ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః ॥ ౩ ॥

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః ।
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః ॥ ౪ ॥

Advertisement

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః ।
వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః ॥ ౫ ॥

సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః ।
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః ॥ ౬ ॥

హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః ।
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ॥ ౭ ॥

హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః ।
భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః ॥ ౮ ॥

కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః ।
మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః ॥ ౯ ॥

వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః ।
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్నో దిగంబరః ॥ ౧౦ ॥

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః ।
శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః ॥ ౧౧ ॥

మృడః పశుపతిర్దేవో మహాదేవోzవ్యయో హరిః ।
భగనేత్రభిదవ్యక్తో దక్షాధ్వరహరో హరః ॥ ౧౨ ॥

పూషదంతభిదవ్యగ్రో సహస్రాక్షస్సహస్రపాత్ ।
అపవర్గప్రదోzనంతస్తారకః పరమేశ్వరః ॥ ౧౩ ॥

ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్ సమాప్తమ్ 🔸


🌼 భావార్థము

ఈ స్తోత్రం పఠించడం ద్వారా భక్తుని చిత్తం నిర్మలమై,
శివుని అనుగ్రహం, క్షేమం, ఆయురారోగ్యం, విజయము ప్రసాదమవుతాయి.
భగవంతుని ప్రతి నామం — ఒక తత్వం, ఒక శక్తి, ఒక అనుభూతి.
ఈ నామాల ద్వారా మనసు శివతత్త్వంలో లీనమవుతుంది