స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

వసంత పంచమి విశిష్టత…!!

blank

వసంత పంచమి మరియు సరస్వతి దేవి పూజా విధానం

వసంత పంచమి మహత్యం మాఘశుద్ధ పంచమినే ‘వసంత పంచమి’ అంటారు. మాఘ నెలలో శుక్ల పంచమి రోజున ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇదే రోజు దేశవ్యాప్తంగా వసంత ఋతువు ప్రారంభమవుతుంది.

ఈ పవిత్ర దినం సరస్వతి దేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. 2024లో ఫిబ్రవరి 3న ఈ ఉత్సవం జరుపుకుంటారు. సరస్వతి దేవిని పూజించడం ద్వారా బుద్ధి, జ్ఞానం, విద్య లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

వసంత పంచమి పూజా విధానం

  • సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి.
  • అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి.
  • క్షీరాన్నం, నేతితో తయారైన పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం మొదలైన నైవేద్యాలు సమర్పించాలి.
  • శ్లోకపఠనం ద్వారా సరస్వతి దేవి అనుగ్రహం పొందవచ్చు.

సరస్వతి దేవి మహిమ శాంత స్వరూపిణి అయిన సరస్వతి దేవి, ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటారు. వీణ సంగీతానికి, జపమాల తపస్సుకు, పుస్తకం విద్యకు, అభయ ముద్ర భక్తుల రక్షణకు సంకేతంగా ఉంటాయి.

సరస్వతి స్తోత్రం

యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః..

సరస్వతి నమస్తుభ్యం

సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్దిర్ భవతు మే సదా||

ఈ రోజున విద్యారంభం (అక్షరాభ్యాసం) చేయడం శుభప్రదం. విద్యార్థులు సరస్వతి దేవి ఆలయాలను దర్శించుకుంటే విద్యారంగంలో రాణించగలరని పండితులు చెబుతున్నారు.

పుస్తకం మరియు జపమాల సంకేతం సరస్వతి దేవి ఎడమ చేతిలో పుస్తకం, కుడి చేతిలో జపమాల ధరించి ఉంటారు. సాధారణంగా కుడిచేతిలో ఉన్న వస్తువుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఈ రూపం మనకు విద్యను చదవడమే కాక, దానిని సదా మననం చేయాలని నేర్పిస్తుంది.

శ్రీ మాత్రే నమః… శ్రీ సరస్వత్యై నమః 🙏

శ్రీ సరస్వతీ దేవి కవచము

01) ఓం శ్రీహ్రీం సరస్వ త్త్యైస్వాహా – శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా – ఫాలం మే సర్వదాఽవతు.

02) ఓం హ్రీం సరస్వత్త్యై స్వాహా – శ్రోత్రే పాతు నిరంతరమ్ | ఓం శ్రీం హ్రీం భగవత్యై స్వాహా – నేత్రయుగ్మం సదాఽవతు.

03) ఓం ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా – నాసాం మే సర్వదాఽవతు | హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా – చోష్ఠం సదాఽవతు.

04) ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహా – దంతపంక్తిం సదాఽవతు | ఐం ఇత్యేకాక్షరో మంత్రో – మమ కంఠం సదాఽవతు.

05) ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం, స్కంధౌ మే శ్రీం సదాఽవతు | ఓం హ్రీం విద్యా ధిష్ఠాతృదేవ్యై స్వాహా – వక్షః సదాఽవతు.

06) ఓం హ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా – మే పాతు నాభికాం | ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహా – మమ హస్తౌ సదాఽవతు.

07) ఓం సర్వ వర్ణాత్మికాయై – పాదయుగ్మం సదాఽవతు | ఓం హ్రీం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా – మాం సర్వదాఽవతు.

08) ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా – ప్రాచ్యాం సదాఽవతు | ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా – అగ్నిదిశి రక్షతు.

09) ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్త్యై బుధజనన్యై స్వాహా | సతతం మంత్రరాజోఽయం – దక్షిణే మాం సదాఽవతు.

10) ఓం ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో – నైరృత్యాం సర్వదాఽవతు | ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా – మాం వారుణేऽవతు.

11) ఓం సర్వాంబికాయై స్వాహా – వాయవ్యే మాం సదాఽవతు | ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా – మాం ఉత్తరేऽవతు.

12) ఓం ఐం సర్వశాస్త్రావాసిన్యై స్వాహా – ఐశాన్యాం సదాఽవతు | ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా – చోర్థ్వం సదాఽవతు.

13) ఓం హ్రీం పుస్తకావాసిన్యై స్వాహా – అధో మాం సదాఽవతు | ఓం గ్రంథబీజ స్వరూపాయై స్వాహా – సర్వతోఽవతు.

శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని సరస్వతి కవచం సంపూర్ణం. 🙏

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

మార్గశిరా లక్ష్మీ వ్రతం: పూజలు మరియు ప్రయోజనాలు

మార్గశీర్ష మాసంలో గురువారం నాడు జరుపుకునే పవిత్రమైన కర్మ మార్గశీర్ష లక్ష్మీ వ్రతం. ఇది శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క అవతారమైన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది.
blank
పండుగలు స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

శివరాత్రి ప్రాముఖ్యత మరియు పూజా విధానం

శివరాత్రి ప్రాముఖ్యత: శివరాత్రి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను ప్రత్యేకంగా భగవంతుడు శివుని పూజకు అంకితమిచ్చారు. ఈ రోజును మహాశివరాత్రి