స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

సరస్వతీదేవి స్తోత్రం

blank

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యావీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా/
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి: దేవై: సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాఢ్యాపహా //

యా = ఏ స్త్రీ మూర్తి
కుంద = మల్లెల వంటి
ఇందు = చంద్రుని వంటి
తుషార = మంచు బిందువుల వంటి
హార = దండలతో
ధవళ = మరింత తెల్లగా ప్రకాశించుచున్నదో
యా = ఏ స్త్రీ మూర్తి
శుభ్ర = పరిశుభ్రమైన (తెల్లనైన)
వస్త్రావృతా = వస్త్రమును ధరించినదో
యా = ఏ స్త్రీ మూర్తి
వీణ = వీణ యనెడి
వర = సమున్నతమైన
దండ = కొయ్య సాధనముతో
మండిత = అలంకరింపబడిన
కరా = చేతులు కలదియై
యా = ఏ స్త్రీ మూర్తి
శ్వేత = తెల్లనైన
పద్మ = తామర పువ్వును
ఆసనా = ఆసనముగా చేసుకొనినదో
యా = ఏ స్త్రీ మూర్తి
బ్రహ్మ = బ్రహ్మ దేవుడు
అచ్యుత = శ్రీ మహావిష్ణువు
శంకర = శివుడు
ప్రభృతిభి: = మొదలుగాగల
దేవై: = దేవతల చేత
సదా = ఎల్లప్పుడును
వందితా = నమస్కారింపబడునో
నిశ్శేష = సంపూర్ణముగా
జాఢ్య = బుద్ధి మాంధ్యమును(అజ్ఞానమును)
ఆపహా = తొలగింప జాలిన
భగవతీ = భగవత్ స్వరూపిణియైన
సరస్వతి = సరస్వతి యనెడి
సా = అటువంటి స్త్రీ మూర్తి
మాం = నన్ను
పాతు = రక్షించుగాక

భావము:-
మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.
ఈ శ్లోకములో సరస్వతి దేవి ధరించినవన్నీ తెలుపులో వున్నాయి. తెలుపు సాత్విక గుణము. జ్ఞానము. తెల్లపువ్వు వలె, చంద్రునివలె,(తుషార)మంచు వలె, హారధవళ – ముత్యాలహారము. తెల్లని వస్త్రములు ధరించినది. తెల్లని పద్మములో ఆసీనురాలయినది, వీణ ధరించినది. సరస్వతి బొమ్మను పిల్లలకు చూపాలి.
సరస్వతి అనగా = చదువుల తల్లి.
సర+స్వ+తి= జ్ఞానము+మనలోని+ఇచ్చునది.
మనలో ఉన్న ఆ జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేస్తుంది.

సరస్వతి ధరించే వీణ పేరు – కఛ్ఛపి
చేతిలో జపమాల – ఆధ్యాత్మికతను అభివృద్ధి చేయును
మరొక చేతిలో వేదములు – అనగా జ్ఞానమును ఇచ్చును
వీణ – సంగీత సాహిత్యము నాదము

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

మార్గశిరా లక్ష్మీ వ్రతం: పూజలు మరియు ప్రయోజనాలు

మార్గశీర్ష మాసంలో గురువారం నాడు జరుపుకునే పవిత్రమైన కర్మ మార్గశీర్ష లక్ష్మీ వ్రతం. ఇది శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క అవతారమైన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది.
blank
పండుగలు స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

శివరాత్రి ప్రాముఖ్యత మరియు పూజా విధానం

శివరాత్రి ప్రాముఖ్యత: శివరాత్రి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను ప్రత్యేకంగా భగవంతుడు శివుని పూజకు అంకితమిచ్చారు. ఈ రోజును మహాశివరాత్రి