శ్రీ రామదాసు కీర్తన..!!

సావేరి - చాపు ( - ఆది).

Advertisement

🌸పల్లవి:-🌸

🌷సీతారామస్వామి నే జేసిన నేరంబేమి!! సీతా !!..🌷

Advertisement

ఖ్యాతిగ నీ
పదపంకంజములు
నే ప్రీతిగ దలపక భేదమెంచితినా!! సీతా !!

చరణము(లు):-
రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా!

సంగతి బంగారుశాలువ పాగాలంగీల్‌ నడికట్లడిగితినా!

Advertisement

చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితినా!

పొంగుచు మువ్వలు ముత్యపు సరములు బాగుగ నిమ్మని యడిగితినా!! సీతా !!

ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటం బడిగితినా!

కోమలమగు నీ మెడలో పుష్పపుదామంబులు నేనడిగితినా!

Advertisement

మోమాటము పడకుండగ నీవగు మురుగులు గొలుసుల నడిగితినా!

కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని!! సీతా !!

తరచుగ నీపాదంబుల నమరిన సరిగజ్జెలను అడిగితినా!

కరుణారస ముప్పొంగ మీ గజతురగము లిమ్మని యడిగితినా!

Advertisement

పరమాత్మ నీ బంగారుశాలువ పైగప్పగ నేనడిగితినా!

స్మరసుందర సురవర సంరక్షక వరమిమ్మని నిన్నడిగితినా!! సీతా !!

ప్రశస్త భద్రాద్రీశుడవని నిను ప్రభుత్వమిమ్మని యడిగితినా!

దశరథసుత నీచేత ధరించిన దానకంకణ మ్మడిగితినా!

విశదముగను నీ మేలిమ మొలనూల్‌ వేడుకతో నేనడిగితినా!

ఏదుము భూమిని కుచ్చలనేలకు నెక్కువగా నిన్నడిగితినా!! సీతా !!.