జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానాలు :

ప్ర : శివపంచాక్షర స్తోత్రంలో 'యక్ష స్వరూపాయ' అని శివుని వర్ణించారు. శివుడు యక్షుడిగా ఎప్పుడు ఎలా అవతరించాడు?
ప్ర : శివపంచాక్షర స్తోత్రంలో 'యక్ష స్వరూపాయ' అని శివుని వర్ణించారు. శివుడు యక్షుడిగా ఎప్పుడు ఎలా అవతరించాడు? దాని అంతరార్థమేమిటి?
జ : ఒకప్పుడు దేవతలు రాక్షసుల్ని జయించి, విజయోత్సహాన్ని జరుపుకుంటున్నారు. అంతా తమ నిర్వాకమేనని ప్రగల్భాలను చెబుతున్న సందర్భంలో వారి ముందు పరబ్రహ్మ 'యక్ష' రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
తద్దైషాం విజజ్ఞౌ, తేభ్యోహ ప్రాదుర్భభూవ
తన్న వ్యజానంత కిమిదం యక్షమితి॥ (కేనోపనిషత్)
దేవతలు ఆయనను గుర్తించలేక ఈ యక్షుడెవరని ఆశ్చర్యపడ్డారు. అప్పుడు అగ్ని అతన్ని తెలుసుకోవడానికై ముందుకు వచ్చి, 'నువ్వేవర'ని ప్రశ్నించాడు. అప్పుడా యక్షుడు దేవతల ప్రతాపాన్ని తెలుసుకోడానికి వచ్చానని చెప్పి-ఒక తృణాన్ని ఎదురుగా ఉంచి అగ్ని యొక్క ప్రతాపాన్ని చూపించమన్నాడు. అగ్ని తన శక్తినంతటినీ వినియోగించినా, ఆ తృణం దహింపబడలేదు. అలాగే వాయువు కూడా దానిని కదిలించలేకపోయింది. అప్పుడు ఇంద్రుడు వినయంగా ఆ యక్షుని ప్రార్థించగా, అక్కడ జగదంబ బ్రహ్మ విద్యాస్వరూపిణిగా సాక్షాత్కరించి 'తాను ఉమాదేవిననీ, ఆ యక్షుడు పరమాత్మ అనీ, అతని శక్తిని' తానని పరబ్రహ్మ గురించి బోధించింది. అలా యక్షునిగా గోచరించిన శివపరమాత్మ దేవతలకు సైతం దైవత్వాన్నిచ్చిన పరంజ్యోతి. ఇది కేనోపనిషత్తులోను, కొన్ని పురాణాలలోను చెప్పబడిన కథ. ఈ ఇతివృత్తాంతం ఆధారంగా 'యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ' అని శివపంచాక్షరస్తోత్రం వర్ణించింది.'యక్ష' శబ్దానికి 'పూజ్యుడు' అని ఒక అర్థం ఉంది.
('ఋషిపీఠం' ప్రచురణ 'సమాధానమ్' పుస్తకం నుండి సేకరణ)
తరచుగా అడిగే ప్రశ్నలు
శివపంచాక్షర స్తోత్రంలో 'యక్షస్వరూపాయ' అంటే అర్థం ఏమిటి?
దేవతలకు సైతం దైవత్వాన్నిచ్చిన పరంజ్యోతి అయిన శివపరమాత్మ యక్షునిగా గోచరించిన కథ ఆధారంగా శివుని 'యక్షస్వరూపాయ' అని వర్ణించారు. 'యక్ష' శబ్దానికి 'పూజ్యుడు' అని కూడా అర్థం ఉంది.
పరబ్రహ్మ యక్ష రూపంలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు?
రాక్షసుల్ని జయించిన దేవతలు అంతా తమ నిర్వాకమేనని ప్రగల్భాలు చెబుతున్న సందర్భంలో పరబ్రహ్మ వారి ముందు 'యక్ష' రూపంతో ప్రత్యక్షమయ్యాడు. దేవతలు ఆయనను గుర్తించలేక ఆశ్చర్యపడ్డారు.
యక్షుని ముందు అగ్ని, వాయువులకు ఏమైంది?
యక్షుడు ఎదురుగా ఉంచిన తృణాన్ని అగ్ని తన శక్తినంతటినీ వినియోగించినా దహించలేకపోయాడు. వాయువు కూడా దానిని కదిలించలేకపోయింది.
యక్షుడు ఎవరో దేవతలకు ఎవరు తెలియజేశారు?
ఇంద్రుడు వినయంగా ప్రార్థించగా జగదంబ బ్రహ్మ విద్యాస్వరూపిణిగా సాక్షాత్కరించింది. తాను ఉమాదేవిననీ, ఆ యక్షుడు పరమాత్మ అనీ, అతని శక్తిని తానేనని ఆమె బోధించింది.
యక్ష స్వరూపం కథ ఏ గ్రంథాలలో ఉంది?
ఈ కథ కేనోపనిషత్తులోను, కొన్ని పురాణాలలోను చెప్పబడింది. ఈ ఇతివృత్తం ఆధారంగానే 'యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ' అని శివపంచాక్షర స్తోత్రం వర్ణించింది.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
ఆధ్యాత్మికత నుంచి మరిన్ని
- నగరాల వారీగా ప్రదోష వ్రతం తేదీలు, ప్రదోష కాలం సమయాలు: నవంబర్ 2026 నుండి జనవరి 2027 వరకు, ప్రదోష కాల పూజతో
- సనాతన ధర్మంలో సిందూరం యొక్క దివ్య ప్రాముఖ్యత
- పవిత్ర హిందూ సంఖ్యలు: 108 సంపూర్ణ కథ మరియు దాని దైవిక ప్రాముఖ్యత
- నారళీ పూర్ణిమ: సముద్ర దేవుడు వరుణుడికి పవిత్ర కొబ్బరికాయల సమర్పణ
- లింగ అభిషేకానికి కావలసిన ఆనందకరమైన ద్రవ్యాలు



