🍁జ్ఞానాన్వేషణ.🍁

అన్ని భావాలలోకి అతి ముఖ్యమైనది 'నేను' అనే భావం. వ్యక్తిత్వమనే భావం కూడా అన్ని భావాలకీ మూలమే.
అన్ని భావాలలోకి అతి ముఖ్యమైనది 'నేను' అనే భావం. వ్యక్తిత్వమనే భావం కూడా అన్ని భావాలకీ మూలమే. ఏ భావమైనా దేనినో ఆశ్రయించే ఉదయిస్తుంది. అహంకారం లేకుండా ఏ భావానికీ అస్తిత్వం లేదు. అహంకారమే భావాలకి నిలయం. అంటే, భావాల వ్యాపకం అహంకారానికి సంబంధించినదే. నువ్వు, అతడు, అది అంటూ మధ్యమ ప్రధమ పురుషులకి సంబంధించినవి 'నేను' అనే ఉత్తమ పురుషకి తప్ప ఇంకెవరికీ గోచరించవు. అందువల్ల ఉత్తమ పురుష ఉదయించిన తరువాతనే అవీ ఉదయిస్తాయి. అంటే మూడూ కలిసే వస్తాయి. కలిసే అణగిపోతాయి. కాబట్టి, 'నేను' లేక వ్యక్తిత్వం అనే అంతిమ కారణం యొక్క ఆరాతీయి.
ఈ 'నేను' అనేది ఎక్కడినుండి ఉదయిస్తున్నది? దాని కోసం లోపల వెతుకు.అది మాయమవుతుంది. ఇదే జ్ఞానాన్వేషణ. తన స్వరూపాన్ని తెలుసుకోవటానికి మనస్సు నిర్విరామంగా కృషిచేస్తే మనస్సంటూ ఏమీ లేదని తేలుతుంది. ఇదే సూటైన మార్గం. మనస్సంటే ఆలోచనల సమూహమే. అన్ని ఆలోచనలకు మూలం 'నేను' అనే భావం. కాబట్టి మనస్సు అంటే 'నేను' అనే ఆలోచనే.
'నేను' అనే ఆలోచన యొక్క పుట్టుకే వ్యక్తి యొక్క జననం కూడ. దాని మరణమంటే వ్యక్తి మరణమే. 'నేను' అనే భావం ఉదయించిన తర్వతనే, శరీరంతో తప్పుగా తాదాత్మ్యం ఉదయిస్తుంది. ఈ 'నేను' అనే భావాన్ని వదిలించుకో. అది సజీవంగా ఉన్నంతకాలమూ బాధ తప్పదు. 'నేను' పోతే, బాధా పోతుంది…
⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️. Namaste 🙏
తరచుగా అడిగే ప్రశ్నలు
జ్ఞానాన్వేషణ ఎలా చేయాలి?
'నేను' అనే భావం ఎక్కడి నుండి ఉదయిస్తున్నదో లోపల వెతకాలి. అలా వెతికితే అది మాయమవుతుంది; ఇదే జ్ఞానాన్వేషణ, ఇదే సూటైన మార్గం.
'నేను' అనే భావం ఎందుకు అన్నిటికంటే ముఖ్యమైనది?
ఏ భావమైనా దేనినో ఆశ్రయించే ఉదయిస్తుంది, అహంకారం లేకుండా ఏ భావానికీ అస్తిత్వం లేదు. అహంకారమే భావాలకు నిలయం కాబట్టి 'నేను' అనే వ్యక్తిత్వ భావమే అన్ని భావాలకు మూలం.
మనస్సు అంటే అసలు ఏమిటి?
మనస్సంటే ఆలోచనల సమూహమే, అన్ని ఆలోచనలకు మూలం 'నేను' అనే భావం. కాబట్టి మనస్సు అంటే 'నేను' అనే ఆలోచనే; తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి నిర్విరామంగా కృషిచేస్తే మనస్సంటూ ఏమీ లేదని తేలుతుంది.
నువ్వు, అతడు, అది అనే భావాలు ఎలా ఉదయిస్తాయి?
మధ్యమ, ప్రథమ పురుషలకు సంబంధించిన ఈ భావాలు 'నేను' అనే ఉత్తమ పురుషకు తప్ప ఇంకెవరికీ గోచరించవు. ఉత్తమ పురుష ఉదయించిన తరువాతనే అవీ ఉదయిస్తాయి; మూడూ కలిసే వస్తాయి, కలిసే అణగిపోతాయి.
'నేను' అనే భావాన్ని వదిలితే బాధ ఎందుకు పోతుంది?
'నేను' అనే భావం ఉదయించిన తర్వాతనే శరీరంతో తప్పుగా తాదాత్మ్యం ఏర్పడుతుంది. ఆ భావం సజీవంగా ఉన్నంతకాలం బాధ తప్పదు; 'నేను' పోతే బాధా పోతుంది.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
ఆధ్యాత్మికత నుంచి మరిన్ని
- నారళీ పూర్ణిమ: సముద్ర దేవుడు వరుణుడికి పవిత్ర కొబ్బరికాయల సమర్పణ
- లింగ అభిషేకానికి కావలసిన ఆనందకరమైన ద్రవ్యాలు
- మౌని అమావాస్య 2027 (మాఘి అమావాస్య): తేదీ, అమావాస్య తిథి, నగరాల వారీగా స్నాన దినం, మౌన వ్రతం, తర్పణం మరియు మాఘ మేళా
- అట్లతద్ది 2026 (బుధవారం, 28 అక్టోబర్): తేదీ, చంద్రోదయం, గౌరీ పూజ మరియు సురక్షిత ఉపవాస మార్గదర్శి
- ఆదివారం హిందూ దైవం: సూర్య పూజా విధానం, మంత్రాలు, ఉపవాసం మరియు ఆచారాలు




