పురాణమంటే అర్థమేమిటి?

పురాణాలలో సర్వశాస్త్రాలు ఇమిడి ఉన్నాయని పెద్దలంతా చెబుతూ ఉంటారు.
అసలీ “పురాణం” అంటే అర్థమేమిటి?
పురాణాలు ఎన్ని ఉన్నాయి? వాటి విశిష్టత ఏమిటి?
అనే విషయాలను పద్మపురాణంలోని ఆది ఖండం వివరిస్తుంది.
పద్దెనిమిది పురాణాలు
పురాణాలు మొత్తం పద్దెనిమిది.
వీటిని శ్రీ మహావిష్ణువు స్వరూపంతో పోల్చారు.
అందుకే ఆయనను పురాణ పురుషుడు అని అంటారు.
| పురాణం | మహావిష్ణువు యొక్క అవయవం |
|---|---|
| 1. పద్మపురాణం | హృదయం |
| 2. వామన పురాణం | చర్మం |
| 3. భాగవత పురాణం | తొడలు |
| 4. మత్స్యపురాణం | మెదడు |
| 5. కూర్మపురాణం | పృష్టభాగం |
| 6. వరాహ పురాణం | కుడి కాలు చీలమండ |
| 7. లింగ పురాణం | ఎడమ చీలమండ |
| 8. నారద పురాణం | బొడ్డు |
| 9. స్కంద పురాణం | వెంట్రుకలు |
| 10. శివ పురాణం | ఎడమ భుజం |
| 11. విష్ణు పురాణం | కుడి భుజం |
| 12. అగ్ని పురాణం | ఎడమ పాదం |
| 13. మార్కండేయ పురాణం | కుడి పాదం |
| 14. భవిష్య పురాణం | కుడి మోకాలు |
| 15. బ్రహ్మ పురాణం | శిరస్సు |
| 16. బ్రహ్మాండ పురాణం | ఎముకలు |
| 17. గరుడ పురాణం | మజ్జ |
| 18. బ్రహ్మవైవర్త పురాణం | ఎడమ మోకాలు |
