హనుమజ్జయంతి — హనుమంతుని జననం, తొమ్మిది అవతారాలు, స్తోత్రాలు
హనుమంతుడు శక్తికి, భక్తికి, వినయానికి ప్రతీక. అంజనాదేవి కుమారుడిగా జన్మించిన ఆయన వాయుపుత్రుడు, రామభక్తుల్లో శ్రేష్ఠుడు. ఈ హనుమజ్జయంతి సందర్భంగా హనుమంతుని జననం, తొమ్మిది అవతారాలు, శక్తివంతమైన శ్లోకాలు, స్మరణ ఫలాన్ని తెలుసుకుందాం.

హనుమంతుడు శక్తికి, భక్తికి, వినయానికి ప్రతీక. అంజనాదేవి కుమారుడిగా జన్మించిన ఆయన వాయుపుత్రుడు, రామభక్తుల్లో శ్రేష్ఠుడు.
హనుమంతుడు శక్తికి, భక్తికి, వినయానికి ప్రతీక. అంజనాదేవి కుమారుడిగా జన్మించిన ఆయన వాయుపుత్రుడు, రామభక్తుల్లో శ్రేష్ఠుడు. చిన్న వయసులోనే సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలోకి ఎగిరిన మహాబలశాలి.
శ్రీరాముడిపై ఆయనకున్న అచంచల భక్తి ప్రపంచానికి ఆదర్శం. సీతామాతను వెతికి లంకలో కనుగొనడం, లంకదహనం చేయడం, సంజీవని పర్వతాన్ని తీసుకురావడం వంటి మహోన్నత కార్యాలు చేసి రామదూతుడిగా చిరస్థాయిగా నిలిచాడు.
హనుమంతుని స్మరించిన వారికి ధైర్యం, బలం, జ్ఞానం, ఆరోగ్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ పవిత్ర రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి, స్వామివారికి ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు పొందాలి.
హనుమంతుని జననం
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా హనుమంతుడు జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది.
ఆమె బాల్యంలో, కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి, ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా, చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది, కోపంతో అంజనను — ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు.
అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా, ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు.
అందువల్ల శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆ క్షణం నుండి ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, వానరములకు రాజు అని తనను తాను పరిచయం చేసుకున్నాడు.
అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన, ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.
ఆమె శిశువుకి జన్మ ఇచ్చింది. ఈ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడని, కేసరినందనుడని, వాయుపుత్ర లేదా పవనపుత్ర — వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. తన తండ్రి కేసరి, తల్లి అప్సర అంజన యొక్క శక్తి, వాయువేగం గలవాడు.
హనుమంతుని పేరు ఎలా వచ్చింది?
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనువు) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది.
తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునకు అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.
ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది
హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. వీటిని హనుమన్నవావతారాలు అంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.
ప్రసన్నాంజనేయస్వామి
వీరాంజనేయస్వామి
Advertisementవింశతిభుజాంజనేయస్వామి
పంచముఖాంజనేయస్వామి
అష్టాదశ భుజాంజనేయస్వామి
సువర్చలాంజనేయస్వామి
చతుర్భుజాంజనేయస్వామి
ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి
వానరాకార ఆంజనేయస్వామి
తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయని చెబుతారు. మన జీవితంలో కూడా హనుమంతుడిలా భక్తి, సేవాభావం, ధైర్యం ఉండాలని కోరుకుందాం.
హనుమంతుని శక్తివంతమైన శ్లోకాలు
శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్।
ఆంజనేయం మహావీరం — బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభం శాంతం — రామదూతం నమామ్యహమ్॥
మర్కటేశ మహోత్సాహ — సర్వశోక వినాశన
శత్రూన్ సంహర మాం రక్ష — శ్రియం దాపయ మే ప్రభో॥
బుద్ధిర్ బలం యశో ధైర్యం
నిర్భయత్వం ఆరోగతా।
అజాడ్యం వాక్పటుత్వం చ
హనుమత్ స్మరణాద్ భవేత్॥
అర్థం: హనుమంతుని స్మరణ వల్ల బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చురుకుదనం, వాక్చాతుర్యం లభిస్తాయి.
హనుమజ్జయంతి సందర్భంగా ఆచరించవలసిన భక్తి కార్యాలు
హనుమాన్ చాలీసా పారాయణం — 108 సార్లు లేదా 11 సార్లు పఠించడం అత్యంత ఫలప్రదం.
సుందరకాండ పఠనం — రామాయణంలోని హనుమంతుని మహాకార్యాలు వర్ణించే భాగం. మనశ్శాంతికీ, విజయానికీ ప్రసిద్ధం.
ప్రదక్షిణలు — ఆంజనేయస్వామి ఆలయంలో 11 లేదా 108 ప్రదక్షిణలు. ఇది శారీరక-మానసిక శుద్ధిని కలిగిస్తుంది.
సింధూరం, తులసీమాల — హనుమంతునికి ఇష్టమైన నైవేద్యాలు. వెన్న ఆరాధనకు ముఖ్యం.
భక్తి-సేవ-ధైర్యం — హనుమంతుని వలే నిత్యజీవితంలో నిష్కామ సేవ, రామభక్తి, నిర్భయత్వాన్ని పెంపొందించుకోవడం నిజమైన ఆరాధన.
ఇంకా చదవండి — హిందూటోన్ తెలుగు
జై శ్రీరామ్! జై హనుమాన్!
ఆంజనేయ స్వామి అనుగ్రహముతో — శుభమస్తు। సమస్త లోకాః సుఖినో భవంతు।
🙏 శ్రీ సద్గురు పీఠం నుండి...




