1. శ్రవణం (వినడం) – భక్తితో వినడం ద్వారా పరిక్షిత్ మహరాజు తరించారు.
  2. కీర్తనం (పాడడం)నారద మహర్షి, అన్నమయ్య, త్యాగరాజు తరించారు.
  3. స్మరణం (ఎల్లప్పుడూ నామస్మరణం)ప్రహ్లాదుడు తరించాడు.
  4. పాదసేవనంలక్ష్మీదేవి, లక్ష్మణుడు తరించారు.
  5. అర్చనంపృధు చక్రవర్తి తరించారు.
  6. వందనంఅక్రూరుడు తరించాడు.
  7. దాస్యభక్తి (సేవ)గరుత్మంతుడు, హనుమంతుడు తరించారు.
  8. సఖ్యం భక్తి (స్నేహభావం)అర్జునుడు, కుచేలుడు తరించారు.
  9. ఆత్మనివేదనంబలిచక్రవర్తి తరించాడు.


🌼 మానవ మహనీయ లక్షణాలు 🌼

Advertisement
  • జీవితంలో దైవనామాన్ని నిరంతరం తరించు.
  • జీవితంలో అంతఃరాత్మకు లోబడిప్రవర్తించు.
  • జీవితంలో శాస్త్రాన్ని అనుసరించి జీవించు.
  • తత్త్వ విచారణ చేయు.
  • యోగ మార్గం ద్వారా ఆత్మ విచారణ చేసి జన్మ రాహిత్యం పొందు.


🪔 పూజా పరమార్థాలు 🪔

🔸 పూజ

పూర్వజన్మ వాసనలను తొలగిస్తుంది.
జన్మ – మృత్యువులను తొలగించి సంపూర్ణ ఫలాన్నిస్తుంది.

Advertisement

🔸 అర్చన

అభీష్ట ఫలాన్నిస్తుంది.
చతుర్విధ పురుషార్థాలకు (ధర్మ, అర్థ, కామ, మోక్షం) ఆశ్రయం.
దేవతలను సంతోషపరుస్తుంది.

🔸 జపం

అనేక జన్మలలో చేసిన పాపాలను పోగొడుతుంది.
పరమదేవతను సాక్షాత్కరింపజేస్తుంది.

Advertisement

🔸 స్తోత్రం

మనస్సుకు శాంతి, ఆనందం కలిగిస్తుంది.
సాధకుని మోక్ష మార్గంలో తరింపజేస్తుంది.

🔸 ధ్యానం

ఇంద్రియ నియంత్రణ కలుగుతుంది.
ఇష్టదేవతపై ఏకాగ్రత పెరుగుతుంది.

🔸 దీక్ష

Advertisement

దివ్య భావాలను కలిగిస్తుంది.
పాపాలను కడిగివేస్తుంది.
సంసార బంధాల నుండి విముక్తిని ఇస్తుంది.

🔸 అభిషేకం

అహంభావాన్ని తొలగిస్తుంది.
భయాలను హరిస్తుంది.
పవిత్ర జలంతో శరీరం – మనస్సుకు ఆనందం కలిగిస్తుంది.

🔸 మంత్రం

మననం చేయబడినదే రక్షణ కర్త” – ఇదే మంత్ర తత్వం.
నిరంతర జపం – ధ్యానం ద్వారా మనసు చెంచలత తొలగి,
జీవితానికి కర్తవ్యోన్ముఖత కలుగుతుంది.


🙏 సారాంశం 🙏

భక్తి ద్వారా శ్రవణం నుండి ఆత్మనివేదన వరకూ తొమ్మిది మార్గాలు మనకు మోక్షసాధన.
పూజ – అర్చన – జప – ధ్యానం ద్వారా మనసు, శరీరం, ఆత్మ శుద్ధి పొంది, జీవితానికి పరమార్థం లభిస్తుంది.