ఆధ్యాత్మికత
పంచబ్రహ్మకృత శివస్తుతి – తత్పురుషకృత శివస్తుతి

తత్పురుష ముఖ స్తుతి స్వచ్ఛఛత్రాభిరామం ఛవిజితరజతం ఛందసాంగీతతుష్టమ్ స్వచ్ఛందాయాం నిరిచ్ఛో దధి నిజమహిగోచ్చన్నమచ్ఛాచ్ఛదేహమ్! ఛద్మేభారిఛదాచ్ఛఛదమజమజరం పిచ్చితాపిచ్చగుచ్చ- ఛాయాసఛాయవామాంగమమదధిషణే సద్విపచ్చేదనేచ్ఛమ్!
తత్పురుష ముఖ స్తుతి
స్వచ్ఛఛత్రాభిరామం ఛవిజితరజతం ఛందసాంగీతతుష్టమ్ స్వచ్ఛందాయాం నిరిచ్ఛో దధి నిజమహిగోచ్చన్నమచ్ఛాచ్ఛదేహమ్! ఛద్మేభారిఛదాచ్ఛఛదమజమజరం పిచ్చితాపిచ్చగుచ్చ- ఛాయాసఛాయవామాంగమమదధిషణే సద్విపచ్చేదనేచ్ఛమ్! ఆశీవిషాంగద సదైవ మహేశ కాశీవాసీకృతానందవన ప్రసీద సంసారవారాశితరే పురారే కీనాశనాశ భయమాశు వినాశయాద్య!!
అర్థం & వివరణ
కీనాశనాశ – యముని నాశనం చేసిన ఓ స్వామీ! నా భయాన్ని పోగొట్టు. సంసార సముద్రానికి ఒడ్డైన హే పురారే! నాకు యమభయాన్ని తొలగించు.
👉 శివలింగారాధన విధానం – ఆచార్యోపదేశం
శివలింగారాధనం ఎలా చేయాలో తెలిసి చేయగలిగితే – సృష్టిలో అంతటి అదృష్టవంతుడు లేడు.
అభిషేక విధానం:
- సన్నటి ధారగా నీటిని పోయాలి.
- పంచపాత్ర + ఉద్ధరిణి ఉపయోగించి పోయకూడదు.
- అభిషేక జలం తొక్కకూడదు.
- గురు ముఖతః అభిషేకం చేయడం ఉత్తమం.
ఆలయ నియమాలు:
- ఫేంటు, తోలు బెల్టు ధరించి గర్భాలయంలోకి వెళ్ళకూడదు.
అత్యుత్తమ ఫలం:
ఆలయంలో కూర్చుని అభిషేకం చేయడం కన్నా – అర్చకులు రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తుండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరించడం → ఎక్కువ ప్రయోజనం.
📜 సాక్షాత్తు శ్రీ చంద్రశేఖర పరమాచార్య స్వామి వాక్కు
🌺 కార్తీక విధులు – ఋషిపీఠం 🌺
నిత్యం శాస్త్రవినోదేన కార్తికే మధుసూదనః, స దహేత్సర్వపాపాని యజ్ఞాయుత ఫలం లభేత్, న తథా తుష్యతే యజ్ఞః న దానైర్వా జపాదిభిః.
అర్థం:
కార్తీకమాసమంతా ఆధ్యాత్మిక శాస్త్రాలు చదువుతూ, వింటూ ఆనందంగా కాలం గడిపేవారు –
- సర్వపాపాలు నశిస్తాయి.
- వేల యజ్ఞాల ఫలం లభిస్తుంది.
- యజ్ఞం, దానం, జపం కూడా ఇంతగా మధుసూదనుని సంతోషపెట్టలేవు.
🔱 హర హర మహాదేవ 🔱




