నిరాశ లేకుండా సాధన మరల మరల చేయాలి

పరిపూర్ణ సిద్ధి పొందే మార్గం సుదూరమైనది మరియు క్లిష్టమైనది

భగవంతుని పై మనస్సు కేంద్రీకరించాలని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, మనకు చాలా సార్లు తెలిసేదేమిటంటే, మనస్సు ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో భ్రమించిపోతుంది♪. కాబట్టి ధ్యాన ప్రక్రియలో ఉన్న మూడు అంచెలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది♪:

  1. బుద్ధి యొక్క విచక్షణా శక్తితో మనం ఈ ప్రపంచం మన లక్ష్యం కాదు అని నిర్ణయించుకోవాలి♪. కాబట్టి, మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చెయ్యాలి. దీనికి పరిశ్రమ అవసరం♪.
  2. మరల, బుద్ధి విచక్షణ శక్తిచే భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని మరియు భగవంతుడిని పొందటమే మన లక్ష్యంగా చేసుకోవాలి♪. కాబట్టి, మనస్సుని తిరిగి తెచ్చి భగవంతుని పైనే కేంద్రీకరించాలి♪. దీనికి కూడా పరిశ్రమ అవసరం♪.
  3. మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి మరల ప్రపంచంలో తిరుగుతుంటుంది♪. దీనికి శ్రమ అవసరం లేదు, దానికదే అనాయాసముగా అయిపోతుంది♪. ఎప్పుడైతే, ఈ మూడవది దానికదే అయిపోతుందో, సాధకులు తరచుగా నిరాశ పడతారు, “భగవంతుని పై మనస్సు కేంద్రీకరించటానికి నేను చాలా ప్రయత్నించాను కానీ మనస్సు తిరిగి ఈ ప్రపంచంలోకి వెళ్లి పోయింది.” అని. శ్రీ కృష్ణుడు మనలను ఇలా నిరాశ పడవద్దు అంటున్నాడు♪. మనస్సు చంచలమైనదే, మనం ఎంత ప్రయత్నించినా అది సహజంగానే, తన ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుంది, అని ముందే అనుకోవాలి, అని అంటున్నాడు♪. కానీ, అది చంచలమై పోయినప్పుడు, తిరిగి మరోసారి, 1వ, 2వ ఉపాయం అవలంబించాలి – మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసివేయాలి మరియు తిరిగి భగవంతునిపై కేంద్రీకరించాలి♪. మరల 3వ పని దానికదే అయిపోతుంది, అని మనకు అనుభవంలోకి వస్తుంది. మనం నిరాశ చెందకుండా, మరల 1వ, 2వ ఉపాయాలు ఉపయోగించు కోవాలి♪.

Advertisement

ఈ సాధనని మరల మరల చేయాలి♪. అప్పుడు క్రమక్రమంగా మనస్సు భగవంతునిపై అనుసంధానం పెరగటం మొదలవుతుంది♪. అదే సమయంలో, ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది♪.

ఇది జరిగే క్రమంలో, ధ్యానం చేయటం ఇంకా ఇంకా సులువుగా అవుతుంది. కానీ, ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణ లోనికి తెచ్చే పోరాటానికి సిద్ధపడాలి 🙏

శ్రీ సద్గురు పీఠం ద్వారా…✍

తరచుగా అడిగే ప్రశ్నలు

ధ్యానంలో మనస్సు ప్రపంచంలోకి వెళ్ళిపోతే నిరాశ పడాలా?

అవసరం లేదు. శ్రీ కృష్ణుడు నిరాశ పడవద్దని చెబుతున్నాడు; మనస్సు చంచలమైనదే అని ముందే అనుకుని, మళ్ళీ దాన్ని భగవంతునిపై కేంద్రీకరించే సాధన చేయాలి.

ధ్యాన ప్రక్రియలో ఉన్న మూడు అంచెలు ఏమిటి?

మొదటిది బుద్ధి విచక్షణతో మనస్సును ప్రాపంచికత్వం నుండి వేరు చేయడం. రెండవది మనస్సును తిరిగి తెచ్చి భగవంతునిపై కేంద్రీకరించడం. మూడవది మనస్సు దానికదే మళ్ళీ ప్రపంచంలోకి తిరగడం.

ధ్యానంలో ఏ అంచెలకు పరిశ్రమ అవసరం?

మనస్సును ప్రపంచం నుండి వేరు చేయడానికి, తిరిగి భగవంతునిపై కేంద్రీకరించడానికి పరిశ్రమ అవసరం. మనస్సు మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళడానికి ఏ శ్రమా అవసరం లేదు, అది అనాయాసంగా జరుగుతుంది.

ధ్యానంలో మనస్సు చంచలమైనప్పుడు ఏమి చేయాలి?

నిరాశ చెందకుండా మళ్ళీ 1వ, 2వ ఉపాయాలు అవలంబించాలి – మనస్సును ప్రపంచం నుండి దూరంగా తీసి, తిరిగి భగవంతునిపై కేంద్రీకరించాలి.

ధ్యాన సాధనను మరల మరల చేస్తే ఏ ఫలితం కలుగుతుంది?

క్రమక్రమంగా మనస్సుకు భగవంతునితో అనుసంధానం పెరుగుతుంది, అదే సమయంలో ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది. దీంతో ధ్యానం చేయడం ఇంకా సులువవుతుంది.

ప్రారంభంలో ధ్యానం ఎందుకు కష్టంగా అనిపిస్తుంది?

ప్రారంభంలో మనస్సు ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో భ్రమిస్తుంది, కాబట్టి దాన్ని క్రమశిక్షణలోకి తెచ్చే పోరాటానికి సిద్ధపడాలి.