*ప్రకృతిలో మూడుగుణాలు అవి సత్వ రజో తమో గుణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి.

కానీ ఒకే గుణం ఉన్న జీవి ఉండదు. అలా ఎందుకు అంటే, ఏ పని చేయడానికైనా రజోగుణం కావాలి.

Advertisement

పని చేసి అలసి పోతే విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రపోవడానికి తమోగుణం కావాలి* .

కాబట్టి పరమ సాత్వికగుణము కలవాడికైనా, రజోగుణం, తమోగుణం లేకపోతే జీవితం సాగదు. కాకపోతే సత్వగుణం ఎక్కువగా, రజస్తమోగుణాలు కొద్దిపాళ్లలో ఉన్న వారిని శుద్ధసత్వగుణ సంపన్నుడు అని అంటారు.

Advertisement

*సత్వగుణం కలిగిన వాడు ప్రకాశవంతంగా, నిర్మలంగా ఉంటాడు. అంటే మంచి తెలితేటలతో వెలిగిపోతుంటాడు.

సోమరి తనం ఉండదు. విషయగ్రహణ శక్తి, ధారణ శక్తి అంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. మనసు నిర్మలంగా ఉంటుంది. చెడు ఆలోచనలు ఉండవు.

సాత్వికుడి మనస్సు ఎటువంటి వికారాలకు, ఒడిదుడుకులకు, ఒత్తిళ్లకు లోను కాదు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా సమత్వ బుద్ధి కలిగి ఉంటుంది. అన్ని చెప్పాడు శ్రీకృష్ణుడు.

శ్రీ సద్గురు పీఠం ద్వారా…✍️