ధ్యానానికి మార్గం: శ్రద్ధ, గురి, సాధన

ధ్యానం చేయాలంటే ముందుగా మనసు నిలబడాలి.మనసు నిలబడాలంటే ధ్యానంపై శ్రద్ధ ఉండాలి.శ్రద్ధ కలగాలంటే లక్ష్యం స్పష్టంగా ఉండాలి.. పట్టుదల లేకుండా, గురి లేకుండా ఎన్నాళ్లు ధ్యానం చేసినా ఫలితం శూన్యం.గురి ఉంది, సంకల్పం ఉంది — అయినా మనసు మాట వినడం లేదు.క
ధ్యానం చేయాలంటే ముందుగా మనసు నిలబడాలి.మనసు నిలబడాలంటే ధ్యానంపై శ్రద్ధ ఉండాలి.శ్రద్ధ కలగాలంటే లక్ష్యం స్పష్టంగా ఉండాలి..
పట్టుదల లేకుండా, గురి లేకుండా ఎన్నాళ్లు ధ్యానం చేసినా ఫలితం శూన్యం.
గురి ఉంది, సంకల్పం ఉంది — అయినా మనసు మాట వినడం లేదు.
కూర్చోగానే ఎన్నో ఆలోచనలు, అనేక సన్నివేశాలు కళ్ల ముందు కదలడం అన్నది చాలా మందికి ఉన్న బాధ.
మనస్సు కుదురుకోడానికి ఒకటే మార్గం — సత్సంగం.
సద్గురువుల బోధలను నిత్యం వినాలి.
ఆ బోధలను మననం చేస్తూ ఉండాలి.
సత్పురుషుల సాంగత్యంలో నిలవాలి.
ఆలయానికి వెళ్ళి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని, ఆలోచనల పరంపరను పక్కన పెట్టి, ధ్యానంపై దృష్టిపెట్టాలి.
ఇలా క్రమంగా చేయడం ద్వారా మనసు నెమ్మదిస్తుంది; ధ్యానంలో నిలకడ వస్తుంది.
ఏది అనుకోగానే సాధ్యం కాదు; క్రమశిక్షణతో సాధన అవసరం.
ఇంట్లో ఉండగా సాధన కుదరటం లేదు అనిపిస్తే — గొడవలు, అశాంతి, సమస్యలు సహజం.
ఎక్కడికైనా దూరంగా వెళ్లి ఒంటరిగా ఉంటానని అనుకోవడం సరైన మార్గం కాదు.
ఎక్కడికి వెళ్లినా మనిషి జీవనంలో సంబంధాలు తప్పవు.
ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక అవసరం మనిషికి మనిషే తీర్చాలి.
ఎక్కడికి వెళ్లినా కొత్త సంబంధాలు ఏర్పడతాయి; వారి అభిప్రాయాలు, మన అభిప్రాయాలు కలయ్యక ఇబ్బందులు మరింత పెరుగుతాయి.
అందుకే — ఉన్నచోటే ఉండాలి.
ఉన్న వారితో సర్దుకుపోవాలి.
ఎవరికి ఇబ్బంది కలగకుండా, మనకూ ఇబ్బంది రాకుండా, సమస్యలను మనమే ప్రశాంతంగా పరిష్కరించుకుంటూ, మన లక్ష్యాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ వెళ్లాలి.
అలా చేస్తూ ఉంటే పరిస్థితులూ, మనస్సూ మనకు అనుకూలంగా మారి, మనల్ని మన లక్ష్యం వైపు నడిపిస్తాయి.
ఏదీ శాశ్వతం కాదు —
మనిషైనా, అనారోగ్యమైనా, వస్తువైనా.
ఓపికతో ఉంటే ఉండాల్సినవే ఉంటాయి; పోయేవి పోతాయి.
సహనం అత్యంత ముఖ్యం.
ఈ లోకంలో శాశ్వతం అనే దానే లేదు.
చిన్ననాటి నుండి ఎన్నో ఇష్టాలు కలిగాయి; అవన్నీ కాలక్రమేణా మారిపోయాయి.
మనం ఇష్టపడ్డవన్నీ నిత్యమైనవి కావు.
వస్తువులు మారాయి, మనుషులు మారారు, ప్రకృతి మారింది — ప్రతి రోజు మార్పే.
“ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు” అనే స్పృహ మనసులో నిలిస్తే —
మనసు ఎక్కడికీ పరిగెత్తదు, స్థిరమవుతుంది.
ఓం ఓం ఓం ఓం ఓం




