వైదిక ధర్మమార్గ పరతాః...!!

మానవ జన్మ, పుంస్త్వ లక్షణాలు, విప్రత్వం — ఇవి లభించటం నిజంగా ఒక దివ్య వరం.
అయితే ఈ లక్షణాలతో ముందుకు సాగినప్పుడే గాని ఆ వరం ప్రయోజనకరం అవుతుంది.

Advertisement

నా దగ్గర సరైన మందు ఉందిగదా అని కూర్చుంటే రోగం తగ్గిపోతుందా?
ఆ మందు సేవిస్తేనే గదా ఉపయో గం!

అలాగే, పై లక్షణాలు గలవాడు ముందుకు పోవాలంటే మార్గం ఏమిటి?
అది — వేదాలు చూపిన ధర్మమార్గంలో నడవాలనే నిష్ఠ.

Advertisement

మన బుద్ధిని ఏకాగ్రం చేసుకోవడానికి వేదాలు మనకు కొన్ని మార్గాలు చూపుతాయి.
అవే —

  • నిస్వార్థ కర్మాచరణ
  • మానసిక పూజ
  • జపం
  • తపం (ధ్యానం)
  • శ్రవణం
  • మననం
  • నిధిధ్యాసనం

ఈ సాధనలను సక్రమంగా ఆచరించినప్పుడు,
మన అంతరంగం పరిశుద్ధమవుతుంది,
మనస్సు శాంతించి ధ్యానానుకూలమవుతుంది,
భగవంతుని పట్ల ఏకాగ్రత కుదురుతుంది.

Advertisement

అందువల్ల —
సత్త్వగుణ ప్రధానులై, వేదాంత శాస్త్రాలను శ్రవణం చేస్తూ, అవి చూపిన మార్గంలో ప్రయాణం చేయాలి.
అట్టి మనోబుద్ధి కలిగినవారు మహదాదృష్టవంతులు.

వేద విరుద్ధ మార్గాల వైపుకు ఆకర్షితులైతే,
ఈ లభించిన జన్మ కూడా వృథా అవుతుంది.
వేదాలను, వేదాంతాన్ని, భగవద్గీతను ఎగతాళి చేసే వారితో చేరరాదు.


శుభమస్తు
శ్రీ సద్గురు పీఠం

సమస్త లోకాః సుఖినో భవంతు