గమనిక:

ఈ సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు మీ ప్రదేశం మరియు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధానం ప్రకారం మార్చుకోవచ్చు.

Advertisement


సంధ్యావందనం సంకల్పం:

శుభాభ్యుదయార్థం, శుభే శోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణు రాజ్ఞేయా, ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్‌లో వారికి మాత్రమే), గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే, శ్రీ లక్ష్మీ నివాస గృహే, సమస్త దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన,

Advertisement

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజ మాసే, కృష్ణ పక్షే, ద్వాదశ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథి చెప్పుకోవాలి, సంధ్యావందనం కోసం మాత్రమే), స్థిర వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే, ఏవం గుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిథౌ,

శ్రీమాన్ ___ గోత్రః ___ నామధేయః, శ్రీమతః ___ గోత్రస్య ___ నామధేయస్య, మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిశ్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం సంధ్యాముపాసిష్యే.

(సంధ్యావందనం కోసం మాత్రమే)

Advertisement

ఇతర పూజల సంకల్పం:

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజ మాసే, కృష్ణ పక్షే, ద్వాదశ్యౌపరి త్రయోదశ్యాం, భృగు వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు:

  • సూర్యోదయం: ఉదయం 6:00 గంటలకు
  • సూర్యాస్తమయం: సాయంత్రం 5:35 గంటలకు
  • శాలివాహన శకం: 1947వ సంవత్సరం
  • విక్రమార్క శతాబ్దం: 2082వ సంవత్సరం
  • కల్యబ్దాః: 5126వ సంవత్సరం
  • సంవత్సరం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
  • అయనం: దక్షిణాయన పుణ్యకాలం
  • ఋతువు: శరదృతువు
  • మాసం: ఆశ్వయుజ మాసం
  • పక్షం: కృష్ణ పక్షం, ద్వాదశి (మధ్యాహ్నం 1:06 వరకు)
  • వారం: శనివారం
  • నక్షత్రం: పుబ్బ (సాయంత్రం 5:23 వరకు)
  • వర్జ్యం: రాత్రి 12:56 నుండి 2:37 వరకు
  • అమృతం: ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:27 వరకు
  • దుర్ముహూర్తం: ఉదయం 5:56 నుండి 7:29 వరకు
  • యోగం: బ్రాహ్మం (తెల్లవారుజామున 4:02 వరకు)
  • కరణం: తైతుల (మధ్యాహ్నం 1:06 వరకు), గరజి (రాత్రి 1:22 వరకు)
  • రాహు కాలం: ఉదయం 9:00 నుండి 10:30 వరకు
  • గుళిక కాలం: ఉదయం 6:00 నుండి 7:30 వరకు
  • యమగండ కాలం: మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు
  • పుణ్య తిథి: ఆశ్వయుజ బహుళ త్రయోదశి


Advertisement

సంప్రదింపు వివరాలు:

ప్రభల విశ్వనాధం శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ వనస్థలిపురం, హైదరాబాద్ - 500070 ఫోన్ నంబర్లు:

  • 801-956-6579
  • 739-686-7592
  • 984-875-1577


శుభాకాంక్షలు:

మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, ఆరోగ్యంగా మరియు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, మీ శ్రేయోభిలాషి.

ఈ రోజు పుట్టిన రోజు మరియు పెళ్ళి రోజు జరుపుకుంటున్న అందరికీ, గాయత్రి మాత ఆయురారోగ్యాలు, సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ, మీ శ్రేయోభిలాషి.