శ్లోకము

అమావాస్యా దినే ప్రాప్తే గృహద్వారం సమాశ్రితాః ।  వాయుభూతాః ప్రపశ్యన్తి శ్రాద్ధం వై పితరో నృణామ్ ॥  యావదస్తమయం భానోః క్షుత్పిపాసా సమాకులాః ।  తతశ్చాస్తంగతే భానౌ నిరాశా దుఃఖ సంయుతాః ॥  నిఃశ్వస్య సుచిరం యాన్తి గర్హయన్తః స్వవంశజమ్ ।  జలేనాపి చ న శ్రాద్ధం శాకేనాపి కరోతి యః ॥  అమాయాం పితరస్తస్య శాపం దత్వా ప్రయాన్తి చ ॥  

Advertisement

భావము
అమావాస్య తిథి పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనది.
ఆ రోజున వారు వాయురూపంలో మన ఇళ్ల ద్వారముల వద్ద నిలిచి, తమ వంశజులు శ్రాద్ధకర్మలు లేదా తర్పణము ఆచరిస్తున్నారా అని గమనిస్తారు.

సాయంత్రం వరకు కూడా ఎటువంటి శ్రాద్ధముగాని, పిండప్రదానముగాని, కనీసం జలతర్పణముగాని జరగనప్పుడు వారు ఆకలి–దప్పికలతో, నిరాశతో, దుఃఖభరితులై వెనుదిరిగి వెళ్తారు.
అంతేకాక, “మా వంశములో ఇలాంటి నిర్లక్ష్యులు పుట్టారు” అని నిట్టూర్పు విడిచి, వంశాభివృద్ధి అడ్డంకులుగా శాపమిచ్చి వెళ్ళిపోతారు.

అందువలన, అమావాస్య రోజున పితృప్రీతికోసం తప్పక కనీసం తిలతర్పణమయినా చేయాలి.
పితృభక్తితో చేసిన చిన్న ఉపచారం కూడా వారికి సంతోషం కలిగిస్తుంది.

Advertisement