(తర్పణ విధి వివరణ)

మహాలయ పక్షం ప్రారంభం అయిన రోజు నుండి అమావాస్య వరకు కొనసాగుతుంది.
ఈ కాలంలో మన పితృదేవతలకు తర్పణం చేయడం అత్యంత శ్రేయస్కరం.

Advertisement

👉 మరణించిన పితృదేవతల కోసం కేవలం 15 నిమిషాలు కేటాయించి ఈ విధంగా తర్పణ విధి చేయండి.
👉 మీ వంశాభివృద్ధి కోసం తప్పక ఆచరించండి.


కావలసిన వస్తువులు

  • పంచ పాత్ర
  • ఉద్ధరిణి
  • జలము
  • 50 గ్రా. నల్ల నువ్వులు
  • ధర్భలు
  • మరణించిన వారి లిస్టు
  • గోత్ర వివరాలు

Advertisement

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా  ఓం నారాయణాయ స్వాహా  ఓం మాధవాయ స్వాహా  ఓం గోవిందాయ నమః  ఓం విష్ణవే నమః  ఓం మధుసూదనాయ నమః  ఓం త్రివిక్రమాయ నమః  ఓం వామనాయ నమః  ఓం శ్రీధరాయ నమః  ఓం హృషీకేశాయ నమః  ఓం పద్మనాభాయ నమః  ఓం దామోదరాయ నమః  ఓం సంకర్షణాయ నమః  ఓం వాసుదేవాయ నమః  ఓం ప్రద్యుమ్నాయ నమః  ఓం అనిరుద్ధాయ నమః  ఓం పురుషోత్తమాయ నమః  ఓం అధోక్షజాయ నమః  ఓం నారసింహాయ నమః  ఓం అచ్యుతాయ నమః  ఓం జనార్దనాయ నమః  ఓం ఉపేంద్రాయ నమః  ఓం హరయే నమః  ఓం శ్రీకృష్ణాయ నమః  

పవిత్రధారణ

  • ధర్భ పవిత్రం ధరించాలి
  • మంత్రజ్ఞానం ఉన్నవారు "ఓం పవిత్రవంతః..." మంత్రాన్ని జపించాలి


Advertisement

భూతోచ్చాటన

ఉత్తిష్ఠంతు భూత పిశాచా, యేతే భూమి భారకాః |
యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ||

👉 నీటిని వాసన చూసి వెనుకకు వేయాలి.
👉 సాధారణ తర్పణంలో నీరు, ప్రత్యేక తర్పణంలో నువ్వులు వాడాలి.
ప్రాణాయామం

ముక్కు బొటనవేలు, చిటికెనవేలితో మూసుకుని మంత్రజపం చేయాలి:

ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియోయోనః ప్రచోదయాత్ ||

Advertisement

సంకల్పం

👉 ప్రతి ప్రాంతానికి ప్రత్యేకంగా ఉంటుంది.
👉 మీ ప్రాంత పురోహితుని సంప్రదించి సరైన సంకల్పం జపించాలి.

ఉదాహరణ సంకల్పం:

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
శ్రీ గోవింద-గోవింద-గోవింద
అద్య బ్రహ్మణ, ద్వితీయ పరార్ధే, స్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే…

తర్పణ విధానం

  1. ప్రాచీనావీతి – యజ్ఞోపవీతం కుడి భుజంపైకి మార్చాలి.
  2. సవ్యకరణం – ఎడమ భుజంపైకి మార్చి నీరు వదలాలి.
  3. ధర్భలపై కూర్చుని పితృదేవతలను ఆహ్వానించడం