రోజువారీ జీవనంలో పాటించవలసిన ఆచారాలు

  • సోమవారం తలకు నూనె రాయరాదు.
  • ఒంటి కాలిపై నిలబడరాదు.
  • మంగళవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు.
  • శుక్రవారం కోడలిని పుట్టింటికి పంపరాదు.
  • గుమ్మడికాయ ముక్కలుగా మాత్రమే ఇంటికి తేవాలి.
  • ఇంటిలోపల గోళ్ళు కత్తిరించరాదు.
  • మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు.
  • సూర్యాస్తమయం తరువాత కసవు వూడ్చరాదు, తల దువ్వరాదు.
  • పెరుగును, ఉప్పును అప్పు ఇవ్వరాదు.
  • వేడి అన్నంలో పెరుగు వేయరాదు.
  • భోజనం మధ్యలో లేచిపోరాదు.
  • తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు.
  • గడపపై పాదం పెట్టి వెళ్లరాదు.
  • బయటకు వెళ్తూ కసవు వూడ్చరాదు.
  • గోడలకు పాదం ఆనించి పడుకోరాదు.
  • రాత్రివేళలో బట్టలు తకరాదు.
  • విరిగిన గాజులు వేసుకోరాదు.
  • నిద్రలేచిన వెంటనే పడుకున్న చాప మడవాలి.
  • చేతి గోళ్ళను కొరకరాదు.
  • అన్న, తమ్ముడు లేదా తండ్రి-కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాదు.
  • ఒంటి అరటాకును తేరాదు.
  • సూర్యాస్తమయం సమయంలో నిద్రపోరాదు.
  • కాళ్ళు కడిగేటప్పుడు మడమలు మర్చిపోరాదు.
  • గడపపై కూర్చోరాదు.
  • తిన్న వెంటనే పడుకోరాదు.
  • పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కూర్చోరాదు.
  • చేతులు కడిగిన తర్వాత నీటిని చల్లరాదు.
  • రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడగాలి.
  • ఎంగిలి చేతితో వడ్డించరాదు.
  • వంట పాత్రలలో తినరాదు.
  • సింకులో ఎంగిలి చేతులు కడగరాదు.
  • ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు పసుపు, కుంకుమ ఇవ్వకపోవడం అనుచితం.
  • చిరిగిన దుస్తులు ధరించరాదు.
  • ఇంట్లో చెప్పులు ధరించరాదు.
  • దేవాలయంలో చెప్పులు పోతే వేరేవి వేసుకుని రాకూడదు.
  • జంతువులకు పాచిపోయిన పదార్థాలు పెట్టకూడదు.
  • ఒకరి బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించరాదు.
  • శనివారం నాడు ఉప్పు, నూనె కొనరాదు.
  • అవసరం లేకుండా కొత్త చెప్పులు కొనరాదు.
  • ఇంటిలో పనికిరాని గడియారాలు, వాచీలు, సైకిళ్లు, కుట్టు మెషిన్లు వదిలించుకోవాలి.

విలువలు & జీవన విధానం

Advertisement
  • దేవుడిని భిక్షగాడిలా అడగకండి – అవసరమైతే ఆయనే ఇస్తాడు.
  • అర్హులకు మాత్రమే గుప్తదానం చేయండి.
  • మఠం లేదా దేవాలయ వస్తువులను దుర్వినియోగం చేయకండి – అది తరతరాలకు శిక్ష అవుతుంది.
  • ఇతరులను విమర్శించడం మానండి; మీని మీరే పొగడుకోవద్దు.
  • అధికారం, సంపద శాశ్వతం కాదు – ఇతరులను ఎదగనివ్వండి.
  • గురువుల్లా ప్రవర్తించండి, శిష్యులను ప్రోత్సహించండి.


సంప్రదాయం అంటే…

కారు మేఘాలు కమ్ముకున్నా, వర్షం కురిసినా ముగ్గు వేసే ఆ అమ్మాయి!

Advertisement

సంస్కారం అంటే…

అమెరికాలో ఉన్న వైద్యుడు, సొంతూరికి వచ్చిన ప్రతిసారి తన గురువుకి పాదాభివందనం చేయడం!

నమ్మకం అంటే…

ఖగోళ శాస్త్ర నిపుణుడు కూడా, గ్రహణం విడిస్తేగాని ఆహారం తీసుకోకపోవడం!

Advertisement

ఆచారం అంటే…

పరమాణు శాస్త్ర పండితుడు కూడా, మనవడి జడ పుణ్యక్షేత్రంలో తీసేందుకు వచ్చిపోవడం!

సనాతన ధర్మం అంటే…

అంతరిక్ష శాస్త్రవేత్త కూడా, పితృదేవతలకు పిండప్రదానం చేయడం!

పద్ధతి అంటే…

అత్తింటికి వెళ్లేముందు ఇంటి పెద్దలకు పాదాభివందనం చేయడం!

Advertisement

సంస్కృతి అంటే…

ఎంత చదివినా, ఎంత పేరు సంపాదించినా, వధువు పెళ్లి పీటలపై వినయంగా ఉండటం!

దాంపత్యం అంటే…

భార్య పక్షవాతం బారినపడినా, భర్త భరోసాగా నిలబడి భారాన్ని మోసుకోవడం!

అనుబంధం అంటే…

ప్రాణం పోతుందన్నా, వెంటిలేటర్‌పై ఉంచి ప్రాణం నిలబెట్టే ప్రయత్నం చేయడం!


🌸 ఇవన్నీ మన పూర్వీకుల సంప్రదాయాలు, విలువలు, సంస్కారాలు.
మనము గుర్తుంచుకొని ఆచరిస్తే జీవితం ప్రశాంతంగా మారుతుంది.