నక్షత్ర స్తోత్ర మాలిక – 25వ రోజు | పూర్వాభాద్ర నక్షత్రానికి శ్రీ దత్త స్తవం

నక్షత్ర స్తోత్ర మాలిక - 25 వ రోజు. నక్షత్రం_పూర్వాభాద్ర.
నక్షత్ర స్తోత్ర మాలిక - 25 వ రోజు.
నక్షత్రం_పూర్వాభాద్ర.
అధిపతి_గురువు.
ఆరాధించాల్సిన దైవం_ అజైకపాదుడు / శ్రీ దక్షిణామూర్తి / శ్రీదత్తాత్రేయ స్వామి. ( గురు స్వరూపం )
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, మరియు ఉన్నత విద్య, జ్ఞానం, మనశ్శాంతి కోరుకునే వారు పఠించాల్సిన మంగళకరమైన స్తోత్రం.
🙏 శ్రీ దత్త స్తవం 🙏
శ్రీ గణేశాయ నమః
శ్రీ సరస్వత్యై నమః
శ్రీపాదవల్లభ నరసింహసరస్వతి
శ్రీగురు దత్తాత్రేయాయ నమః
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్ ।
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 1 ॥
దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణమ్ ।
సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 2 ॥
శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ ।
నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు ॥ 3 ॥
సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళమ్ ।
సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 4 ॥
బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనమ్ ।
భక్తాఽభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు ॥ 5 ॥
శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః ।
తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు ॥ 6 ॥
సర్వరోగప్రశమనం సర్వపీడానివారణమ్ ।
విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు ॥ 7 ॥
జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకమ్ ।
నిశ్శ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు ॥ 8 ॥
జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవమ్ ।
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ॥9 ॥
శ్రీ గణేశాయ నమః
శ్రీ సరస్వత్యై నమః
శ్రీపాదవల్లభ నరసింహసరస్వతి
శ్రీగురు దత్తాత్రేయాయ నమః
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
తరచుగా అడిగే ప్రశ్నలు
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఏ స్తోత్రం పఠించాలి?
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు శ్రీ దత్త స్తవం పఠించాలి. ఉన్నత విద్య, జ్ఞానం, మనశ్శాంతి కోరుకునే వారికి కూడా ఇది మంగళకరమైన స్తోత్రం.
పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు?
పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు. నక్షత్ర స్తోత్ర మాలికలో ఇది 25వ రోజు నక్షత్రం.
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఆరాధించాల్సిన దైవం ఎవరు?
అజైకపాదుడు, శ్రీ దక్షిణామూర్తి లేదా శ్రీదత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఈ దైవాలు గురు స్వరూపాలు.
శ్రీ దత్త స్తవంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
శ్రీ దత్త స్తవంలో 9 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకం చివర "స్మర్తృగామి సనోవతు" అనే పదం వస్తుంది, తొమ్మిదవ శ్లోకం ఫలశ్రుతి.
శ్రీ దత్త స్తవం పఠిస్తే ఫలం ఏమిటి?
ఫలశ్రుతి ప్రకారం జయ, లాభ, యశస్సు, కామనలను ఇచ్చే దత్తుని ఈ స్తవాన్ని పఠించేవారు సుకృతులు అవుతారు. ఇది భోగమోక్షప్రదమైన స్తోత్రంగా చెప్పబడింది.




