పంచ పాత్రల అసలైన అర్థం – హిందూ ఆరాధనలో శుద్ధోదక విధానం

పంచ పాత్ర అంటే ఒక పాత్ర కాదు.
ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి.
మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నాము.

మొదటిది అర్ఘ్య పాత్ర: భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో కూడిన పాత్ర

రెండవది పాద్య పాత్ర: ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర

మూడవది ఆచమనీయ పాత్ర: ఇది భగవంతుని కి పుక్కిలించడానికి సమర్పించే శుద్దోదకం నింపిన పాత్ర.

నాలుగవది స్నాన పాత్ర: ఇది భగవంతుని కి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న పాత్ర

ఐదవది శుద్ధోదక పాత్ర- ఇందులో భగవంతుని కి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర

ఇవి పంచ పాత్రలు..ఇవి గాక ప్రతిగ్రాహక పాత్ర ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర,మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి.

ఇంకా సర్వార్థ జల పాత్ర- ఇది మన చేతులు మరియు,ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర.
హిందూధర్మ సాంప్రదాయాలు ఆచరిద్దాం - పాటిద్దాం.

తరచుగా అడిగే ప్రశ్నలు

పంచ పాత్ర అంటే ఒకే పాత్రా లేక అయిదు పాత్రలా?

పంచ పాత్ర అంటే ఒక పాత్ర కాదు. ఆరాధనకు అయిదు వేర్వేరు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి, కానీ చాలామంది ఒకే పాత్రలో అన్నీ ఉంచి పూజ ముగిస్తున్నారు.

పూజలో ఉపయోగించే అయిదు పాత్రలు ఏవి?

అర్ఘ్య పాత్ర, పాద్య పాత్ర, ఆచమనీయ పాత్ర, స్నాన పాత్ర, శుద్ధోదక పాత్ర – ఇవే పంచ పాత్రలు. ప్రతిదానిలో శుద్ధ జలం నింపి భగవంతునికి సమర్పిస్తారు.

అర్ఘ్య పాత్ర మరియు పాద్య పాత్ర మధ్య తేడా ఏమిటి?

అర్ఘ్య పాత్రలోని శుద్ధ జలం భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పిస్తారు. పాద్య పాత్రలోని జలం భగవంతుని పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పిస్తారు.

ఆచమనీయ పాత్రను దేనికి ఉపయోగిస్తారు?

ఆచమనీయ పాత్ర భగవంతునికి పుక్కిలించడానికి సమర్పించే శుద్ధోదకం నింపిన పాత్ర.

ప్రతిగ్రాహక పాత్ర ఎందుకు అవసరం?

ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలను నింపుకునేందుకు ప్రతిగ్రాహక పాత్ర ఉపయోగిస్తారు. ఇది పంచ పాత్రలకు అదనంగా ఉండే పాత్ర.

సర్వార్థ జల పాత్ర ఉపయోగం ఏమిటి?

సర్వార్థ జల పాత్రలోని శుద్ధ జలంతో మన చేతులు, ప్రతీ ఉపచారానికి మధ్య ఉద్ధరిణను శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారం చేస్తారు.